నిజానికి తెలుగు రాష్ట్రాలలో పట్టణ జనాభా కన్నా గ్రామీణ జనాభానే అధికంగా ఉంటుంది.దాదాపు 60 శాతానికి పైగా జనాబా పల్లె ల లోనే( Rural Areas ) ఇంకా నివసిస్తున్నారు అన్న అంచనాలు ఉన్నాయి.
అందువల్ల గ్రామీణ జనాబా ని మెప్పిస్తే గెలుపు సులభ్యమన్న రీతిలోనే రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తూ ఉంటాయి.ఇప్పుడు వైసీపీ( YCP ) కూడా గ్రామీణ జనాబా పైనే ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది .పైగా తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలను , సామాజికంగా వెనకబడిన వర్గాలనే లక్ష్యంగా చేసుకొని అమలు చేస్తున్న జగన్( Jagan ) ఆ ప్రయత్నంలో చాలా వరకు విజయవంతమయ్యారని చెబుతున్నారు.నిన్న మొన్నటి వరకు జగన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పనలో భారీగా విఫలమైందని, పారిశ్రామిక అభివృద్ధి కూడా సంతృప్తికర స్థాయిలో లేదన్న మీడియా లో వార్తలు వచ్చేవి.
అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ పరిస్థితి మారుతుందని గ్రామీణ జనాభాను ఆకట్టుకునే పనిలో వైసిపి వేగం పెంచిందని తెలుస్తుంది.ముఖ్యంగా ఇటీవల అసైన్డ్ భూమ్ లు మరియు బ్రిటిష్ కాలం నాటి చుక్కల భూములు సమస్యకు జగన్ సర్కార్ శాశ్వత పరిష్కారం కూడా చూపించడంతో ఇప్పుడు ఆ చర్య వల లాబాపడ్డ వర్గాలు కూడా జగన్ కు మద్దత్తు గా నిలబడతాయన్న విశ్లేషణ లు వస్తున్నాయి.అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన వైసీపీ సర్కార్ వాటిని పరిష్కరించడానికి చాలా దూకుడుగా ముందుకు వెళుతుంది.
దాంతో పైకి ప్రచారం అవుతున్న వ్యతిరేకత ఎలా ఉన్నా గ్రామీణ స్థాయిలో వైసీపీకి నిశ్శబ్దంగా ఓటు బ్యాంకు( Vote Bank ) పెరుగుతూ ఉందని అది వచ్చే ఎన్నికల్లో ప్రతిపలిస్తుందని వైసీపీ అధిష్టానం నమ్ముతుంది.పైగా పటిష్టమైన వాలంటీర్ వ్యవస్థ( Volunteer System ) అండ కూడా ఉండటంతో ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలను ఆలోచనలను పసిగడుతూ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతుందట వైసీపీ అధిష్టానం. మరి పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటు శాతం తగ్గినా కూడా పల్లెలు తనను గట్టేక్కిస్తాయి అన్న ధీమా లో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తుంది.
మరి జగన్ ధీమా గెలుస్తుందో చూడాలి.