లయన్ కింగ్ సినిమా చూస్తూ ఏడ్చేసిన కుక్క.. గుండెల్ని పిండేస్తున్న ఎమోషనల్ వీడియో..

కుక్కలకు మాటలు రావు కానీ అవి మనుషులాగానే ఆలోచించగలవు.ప్రేమను చూపించగలవు.

 Dog Cries While Watching Lion King Movie,viral Video, Lion King, Dog, Mufasa, D-TeluguStop.com

యజమానులతో కమ్యూనికేట్ కాగలవు.అంతేకాదు చాలా పనులను కూడా అవి చేయగలవు.

కొన్నిసార్లు అవి మనుషుల వలె సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయగలవు.తాజాగా ఒక కుక్క లయన్ కింగ్ సినిమా చూస్తూ బాగా రియాక్ట్ అయింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అయింది.@LifeEpoch అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

దీనిని చాలా ఇతర అకౌంట్లు కూడా రీ షేర్ చేస్తున్నాయి.వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

లూనా ఒక స్మార్ట్ కుక్క( Smart Dog ).ఇది నాలుగు నెలల వయసు కలిగి ఉంది.

అది దాని ఓనర్ తో కలిసి టీవీలో లయన్ కింగ్ సినిమా( Lion King ) చూస్తోంది.లయన్ కింగ్ సినిమాలో సింబా తండ్రి ముఫాసా చనిపోతాడనే విషయం తెలిసిందే.ఈ సీన్ చాలా హార్ట్ టచింగ్( Heart Touching ) గా ఉంటుంది.ముఫాసా సోదరుడు స్కార్ వెన్నుపోటు పొడిచి దాన్ని చంపేస్తాడు.సింబా తన తండ్రి చావును చూసి తట్టుకోలేక పోతుంది.తన తండ్రిని లేపడానికి ప్రయత్నిస్తుంది.

ఈ సన్నివేశం చూసిన వారెవరికైనా కంటి నుంచి నీళ్లు రావాల్సిందే.అయితే కుక్క( Dog ) కూడా మనుషుల లాగానే ఈ సన్నివేశాన్ని చూసి బాగా ఏడ్చేసింది.

వైరల్ వీడియో( Viral Video )లో ఆ దృశ్యాన్ని మీరు గమనించవచ్చు.సింబా చనిపోయిన ముఫాసాని లేపడానికి ప్రయత్నిస్తుంటే.

అది లేవాలి లేవాలి అంటూ ఇది గట్టిగా కోరుకుంటున్నట్లు కూడా కనిపించింది.అతడు చనిపోయిన నిజాన్ని ఇది కూడా యాక్సెప్ట్ చేయలేదు “నో చనిపోవద్దు కమాన్, లేచి నిలబడు” అన్నట్లు సదరు కుక్క రియాక్షన్స్ చూపించింది.అచ్చం మనుషుల లాగానే లూనా డాగ్ ఆ సన్నివేశానికి రియాక్ట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.సింబా( Simba )తో కలిసి సానుభూతి చూపుతున్న పప్పీని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.

సో క్యూట్, ఇది చాలా అద్భుతంగా అనిపించింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube