ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఓటర్లే న్యాయనిర్ణేతలు, ఓటర్లే దేవుళ్ళు అందుకే నాయకులు నిత్యం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో ఫీట్లు వేస్తుంటారు.అలాంటి ఆసక్తికర పరిస్థితులే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి.
తనకు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడుగుతుంటే, వరుసగా రెండో సారి నేనే సీఎం అని తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని జగన్ అడుగుతున్నాడు.ఇక చంద్రబాబు మాత్రం ఏపీ ని రిపేర్ చేయాలని తనకు నాలుగో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాడు.
ఒక్క ఛాన్స్ అడిగిన వారికీ ఛాన్స్ ఇచ్చారా :
ఒక ఛాన్స్ అడిగిన వాళ్లకు అవకాశం తొలిసారిగా రాలేదు.2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు ఎన్నికల ప్రచారంలో ప్రతిచోట ఒక్క ఛాన్స్ ఇవ్వండని చిరు రిక్వెస్ట్ చేశాడు.ప్రజారాజ్యానికి సీట్లు,ఓట్లు ఇచ్చి ఇంకా సమయం ఉందని మూడో స్థానంలో కూర్చోబెట్టారు.చిరంజీవి జాగ్రత్తగా పార్టీని నడిపి ఉండి ఉండింటే ఏదో రోజు ప్రజలు అవకాశం ఇచ్చేవారు.
జగన్ 2012లో పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అడిగాడు.అయితే రాష్ట్ర విభజన సమయంలో అనుభవజ్ఞుడైన సీఎం ఉండాలని టిడిపిని ఎన్నుకున్నారు ప్రజలు.
ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ కి 2019లో అవకాశం ఇచ్చారు ప్రజలు.

పవన్ కళ్యాణ్ 2019 లో ఒక ఛాన్స్ అని అడిగాడు.అప్పటికి బలమైన విపక్షంగా వైసిపి ఉండడంతో 2019లో వైసిపికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు ప్రజలు.ఇప్పుడు 2024లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని పవన్ అడుగుతున్నాడు.
ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది అన్న ఆలోచనలో ఓటర్లు ఉన్నట్లు సమాచారం.ఒకేసారి సీఎం సీటు ఇవ్వాలంటే ప్రజలు ఆలోచన చేస్తారు.
పవన్ రాజకీయ అనుభవం గడించాలి, తాను ఎమ్మెల్యే కావాలి అలాంటప్పుడే ఎన్నో కొన్ని సీట్లు ఇస్తారు.లేదంటే పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ లాగా మెస్మరైజింగ్ చేస్తే అవకాశం ఇస్తారు.
ఇక జగన్ రెండో ఛాన్స్ అడుగుతున్నాడు కానీ ప్రజలు రెండో ఛాన్స్ ఇవ్వరు అని విశ్లేషకులు భావిస్తున్నారు.జగన్ పరిపాలన బాగుంది అంటేనే ప్రజలు రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక చంద్రబాబు నాలుగోసారి ఛాన్స్ అడుగుతున్నాడు ఇప్పటికే చంద్రబాబు పరిపాలన ప్రజలు గమనించారు.అయనపై ప్రజలకు మరింత నమ్మకం కలిగితే నాలుగోసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.
మరి ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడక తప్పదు.