సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’.ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
మరి వారి ఎదురు చూపులకు ఫలితంగా మరొక వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
విజయ్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా తర్వాత వీరి ఎదురు చూపులు పీక్స్ కు చేరుకున్నాయి.

ఇది ఇలా ఉండగా మేకర్స్ మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నట్టు తెలుస్తుంది.అందుకనే ప్రొమోషన్స్ కూడా చాలా చోట్ల కష్టమైన సరే ప్రాణం పెట్టి చేస్తున్నారు.వీరు ప్రొమోషన్స్ లో చేసే వ్యాఖ్యలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచడంలో ఈ వ్యాఖ్యలు ఉపయోగ పడుతున్నాయి.
తాజాగా పూరీ చేసిన వ్యాఖ్యలతో మేకర్స్ ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్ధం అవుతుంది.ఈయన ఈ సినిమా విజయంపై మాట్లాడుతూ.ఈ సినిమా అందుకునే విజయం ఎలా ఉంటుంది అంటే.ఈ సినిమాను నమ్మి మా తర్వాత చేసే జనగణమణ సినిమాను డబుల్ బడ్జెట్ తో స్టార్ట్ చేసాం.
దీనితోనే మీకు అర్ధం అవుతుంది ఈ సినిమా ఎంత హిట్ కాబోతుందో అంటూ ఈయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.







