దీపావళి అంటేనే పటాసులు పేల్చి సంబురాలు జరపుకుంటాం.ఇక ప్రజల అభిరుచులకు తగ్గట్టు కంపెనీలు కూడా బాగానే వెరైటీలు ప్లాన్ చేస్తుంటాయి.
ట్రెండింగ్ లో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకుని టపాలసులకు పేర్లు పెట్టడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం.గతంలో బాహుబలి పేరుతో బాంబులు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
ఎందుకంటే ప్రజలకు బాగా కనెక్ట్ అయిన వాటి పేర్లతో అమ్మితే ఎక్కువగా అమ్ముడు పోతాయనేది వ్యాపారుల ఆలోచన.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ ఆలోచన చేశారు వ్యాపారులు.
ప్రమోషన్స్ కోసం ఏకంగా ఏపీ సీఎం జగన్ పేరును వాడేశారు.ఏపీలో రాజకీయాలు అంటే ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మామూలుగానే ఇక్కడ జగన్ పేరు చెబితే ఓ రేంజ్ లో అభిమానం వెల్లివిరుస్తుంది.అందుకే ఆయన పేరుకు ఉన్న క్రేజ్ ను వాడుకుని నాలుగు రాళ్లు వేనకేసుకోవాలని వ్యాపారులు పలు రకాల బాణసంచాలను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చారు.
ఆయన పేరు మీద చాలా రకాల భూచక్రాలు అలాగే చిచ్చుబుడ్లు లాంటివి తయారు చేశారు.అయితే ఇందులో ప్రత్యేకంగా జగన్ ఆటం బాంబులు చాలా స్పెషల్ గా నిలుస్తున్నాయి.
పేరు వినేందుకునే కొంచెం ఎక్కడో సింక్ అయినట్టు కనిపిస్తోంది కదా.అవును జగన్ కడపకు చెందిన వాడు కాబట్టి అలా సింక్ అయ్యే విధంగా ఆటం బాంబు అనే పేరు పెట్టేశారు.
సీఎం జగన్ క్రేజ్ ను వ్యాపారులు ఇలా వాడేశారన్నమాట.ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని గన్నవరం పట్టణంలో ఈ ఆటంబాంబులు చాలా వేగంగా అమ్ముడుపోతున్నాయి.వీటి కోసం జనాలు కూడా బాగానే ఎగబడుతున్నారు.దీంతో ఇప్పుడు ఈ ఆటంబాంబుల ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
వాటిని చూసిన వారంతా రకరకాల కామెంట్లు పెట్టేస్తున్నారు.
.