ఎంత చేసినా ఇంతేనా ? వారిపై  జగన్ ఆగ్రహం ?

వాస్తవానికి ఏపీలో జగన్ అధికారం చేపట్టిన తర్వాత  అన్ని విషయాల్లోనూ సమగ్ర ప్రక్షాళన జరిగింది.ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలయ్యాయి.

కరోనా కష్టకాలంలో ను లబ్ధిదారులకు ఎటువంటి ఆటంకం లేకుండా బ్యాంకు ఖాతాలో సొమ్ములు జమ అయ్యాయి.ఇంకా ఇప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వేల కోట్ల నిధులను వాటి కోసం ఖర్చు పెడుతూ,  జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

ఏపీలో నిధుల సమస్య ఏర్పడినా,  జగన్ ఏదో ఒక రూపంలో ఆ నిధులను సర్దుబాటు చేసుకుంటూ , ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు.అయినా జనాల్లో ఏదో తెలియని అసంతృప్తి జగన్ ప్రభుత్వంపై కనిపిస్తోంది.

ఏ నియోజకవర్గం లోని మెజార్టీ ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా లేరు  అనే లెక్కలు జగన్ కు అందుతున్నాయి.అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు విడుదల చేస్తున్న, నిధుల అంశం ఎక్కువ చర్చకు రాకుండా, ఏపీ పడుతున్న ఇబ్బందులు , ఆర్థిక కష్టాలు పథకాలలోని అని చిన్న చిన్న లోపాలు పైన ఎక్కువ చర్చ జరుగుతూ ఉండడంతో,  వైసీపీ ప్రభుత్వానికి ఆశించినంత స్థాయిలో క్రెడిట్ అయితే దక్కడం లేదు.

Advertisement

దీనికి కారణాలు చాలానే ఉన్నాయట.క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఉన్న ఎమ్మెల్యేలతోపాటు కీలక నాయకులు ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడం, ఇదే అంశాన్ని టీడీపీ హైలెట్ చేసుకుని తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వస్తుండడం ఇలా ఎన్నో అంశాలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి .రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ 2019 తరహా ఫలితాలు రావాలంటే ప్రజల్లో ప్రభుత్వ పాలనపై సంతృప్తి కలిగేలా ప్రచారం నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు .

ఈ మేరకు ఎమ్మెల్యేలు ,  నాయకులకు,  మంత్రులకు జగన్ నుంచి వార్నింగ్ వెళ్ళినట్లు సమాచారం.రాబోయే ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ఇప్పటి నుంచే గెలుపునకు అవసరమైన బాటలు వేసుకోపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అనే సూచనలు ఎన్నో జగన్ నుంచి అందుతున్నాయట.

Advertisement

తాజా వార్తలు