జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం..: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై( Jagadish Reddy ) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నిత్యం ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న తనపై విమర్శలా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.అక్రమంగా మద్యం అమ్మి జైలుకెళ్లిన జగదీశ్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లలో అక్రమాలు,

కరెంట్ కొనుగోళ్ల దోపిడీని బయట పెడుతున్నాననే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే జగదీశ్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.జగదీశ్ రెడ్డి అవినీతిపై విజిలెన్స్ మరియు సిట్టింగ్ జడ్జితో( Vigilance and Sitting Judge ) విచారణ జరిపిస్తామని తెలిపారు.

ఇక జగదీశ్ రెడ్డి జైలుకు( Jail ) వెళ్లడం ఎవరూ ఆపలేరన్న ఆయన కేసీఆర్ ( KCR ) కుటుంబం తరువాత జైలుకెళ్లే రెండో వ్యక్తి జగదీశ్ రెడ్డేనని స్పష్టం చేశారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు