Bollywood Jacqueline Fernandez : బాలీవుడ్ బ్యూటీ పై దారుణంగా ట్రోల్స్ చేసిన నెటిజన్స్.. సర్జరీల మాటేంటంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ గురించి వ్యతిరేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయింది.

 Jacqueline Fernandez Gets Trolled Her Views Cosmetic Surgery , Jacqueline Fernan-TeluguStop.com

మరి ముఖ్యంగా మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ కేసు విషయంలో ఈమె పేరు కీలకంగా మారిన విషయం తెలిసిందే.దీంతో కొద్దిరోజులపాటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె పేరు మారుమోగిపోయింది.

ఇది ఇలా ఉంటే జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ గతంలో ప్లాస్టిక్ సర్జరీ ల విషయంపై మాట్లాడిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఆ వీడియోని చూసిన పలువురు నెటిజన్స్ అందం కోసం మీరు చేయించుకున్న సర్జరీల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ 2006 లో శ్రీలంక మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే న్యాయ నిర్ణయితలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్లాస్టిక్‌ సర్జరీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆ వీడియోలో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.ప్లాస్టిక్‌ సర్జరీ మహిళల సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది.

అలా చేయించుకోవడం వల్ల వచ్చే అందం నిజమైంది కాదు.అలాంటి వాటికి నేను పూర్తిగా వ్యతిరేకిని అంటూ చెప్పుకొచ్చింది.అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.ఇప్పటిదాకా మీరు ఎన్నిసార్లు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.

అందంగా కనిపించడం కోసం మీరు చేయించుకున్న శస్త్ర చికిత్సల మాటేమిటి అంటూ ప్రశ్నించారు.ఈ విషయంతో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచింది.

మరి నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలకు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.ఇది ఇలా ఉంటే జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ విషయానికొస్తే.తాజాగా ఈమె సర్కస్‌ ట్రైలర్‌ ప్రీమియర్‌ లో కనిపించిన విషయం తెలిసిందే.బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన రామ్‌ సేతు చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube