పటాస్ జబర్దస్త్ వంటి కామెడీ షో ల ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి వారిలో యాదమ్మ రాజు ( Yadamma Raju ) ఒకరు.
ఈయన పటాస్( patas ) కార్యక్రమంతో తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నటువంటి యాదమ్మ రాజు సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించినటువంటి ఈయన ఇటీవల ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన అరెస్ట్ ( Arrest )అయ్యారంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.యాదమ్మ రాజు అరెస్ట్ కావడంతో 14 రోజులపాటు రిమాండ్ విధించారని సమాచారం.
అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అసలు యాదమ్మ రాజు అరెస్ట్ కావడం ఏంటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు.
ఇక ఈయన అరెస్ట్ కావడం వెనుక పెద్ద స్టోరీ ఉందని తెలుస్తుంది.ఈయన నిజంగానే అరెస్టు అయ్యారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే ఇదంతా కూడా సినిమా ప్రమోషన్ లో ఒక భాగమని తెలుస్తుంది.ప్రస్తుతం యాదమ్మ రాజు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగానే ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నట్లు సమాచారం.మరి ఈయన చేస్తున్న సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…తన ఆస్తిని తాను సాధించుకోవడం కోసం యాదమ్మ రాజు తన స్నేహితుడితో వెంట్రుకలను సేకరిస్తున్నాడట.
ఈ స్టోరీ లైన్ తో సినిమా మొత్తం రాబోతుందని త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను తెలియచేయునున్నట్టు సమాచారం.
.