జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందనే సంగతి తెలిసిందే.ఈ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో పవిత్ర ఒకరు.
ఈ షో ద్వారా పవిత్రకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతోంది.జబర్దస్త్ పవిత్రకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది.
యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేయడం ద్వారా పవిత్ర పాపులర్ అవుతున్నారు.మా పెళ్లి షాపింగ్ అనే థంబ్ నైల్ తో పవిత్ర ఈ వీడియోను షేర్ చేశారు.
జబర్దస్త్ తేజతో కలిసి పవిత్ర ఈ వీడియోలో కనిపించడం గమనార్హం.తేజ పవిత్ర ప్రేమలో ఉన్నారని వార్తలు ఎప్పుడూ ప్రచారంలోకి రాలేదు.అకస్మాత్తుగా పవిత్ర తేజతో కలిసి వీడియో చేయడంతో అందరూ షాకయ్యారు.తేజ పెళ్లి చీరల షాపింగ్ కోసం వచ్చానని చెప్పగా జబర్దస్త్ పవిత్ర మాత్రం ఊరికే అంటూ కామెంట్ చేశారు.
తేజ, పవిత్ర ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ వీడియో ద్వారా ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఎక్కువ మొత్తంలో బిల్ కాగా తేజ కార్డ్ తో పవిత్ర బిల్లును చెల్లించడం గమనార్హం.
అయితే తేజ, పవిత్రల పెళ్లి నిజం కాదని ఈ వీడియోను ప్రమోషనల్ వీడియోగా చేశారని తర్వాత అర్థమైంది.వ్యూస్ కోసం పవిత్ర ఇలా చేయడం ఏంటని కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
పవిత్ర లాంటి క్రేజ్ ఉన్న నటులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవిత్రకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.జబర్దస్త్ పవిత్ర సినిమా ఆఫర్లతో కూడా బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.