కన్నీళ్లు కూడా రాలేదంటూ అనసూయపై దారుణమైన ట్రోల్స్

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.అనసూయ జబర్దస్త్‌ ను వీడి పోతుంది అనే విషయం చాలా రోజులుగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే.

 Jabardasth Comedy Show Fans Trolls On Anasuya,anasuya,indraja, Jabardasth,sudhee-TeluguStop.com

జబర్దస్త్‌ ఈ వారం ఎపిసోడ్ తో అనసూయ గుడ్‌ బై చెప్పబోతుంది అంటూ అధికారికంగా క్లారిటీ వచ్చింది.అనసూయ జబర్దస్త్‌ షో కు ఇదే చివరి ఎపిసోడ్‌ అంటూ తాగుబోతు రమేష్ ఒక స్కిట్‌ చేశాడు.

ఆ స్కిట్ తో అంతా కూడా కన్నీరు మున్నీరు అయ్యారు.ముఖ్యంగా ఇంద్రజ కు కన్నీళ్లు ఆగలేదు.

ఆమె కన్నీళ్లు ఆగక పోవడంతో వెళ్లి అనసూయను హత్తుకుని మరీ ఏడ్చేసింది.చంటి కూడా నెలలో మూడు రోజులు మా కోసం కేటాయించలేవా అంటూ ప్రశ్నించాడు.

అంతే కాకుండా చాలా మంది కూడా అనసూయ ను ఉండాల్సిందిగా రిక్వెస్ట్‌ చేశారు.కాని తప్పని పరిస్థితుల్లో అనసూయ వెళ్లి పోవాల్సి వస్తుందని అనసూయ చెప్పేసింది.

అయితే ఇంత మంది కన్నీళ్లు పెట్టుకున్నా కూడా అనసూయ మాత్రం కనీసం కళ్లలో నీళ్లు రాలేదు.

మీ పిల్లలు ఇద్దరు చిన్న వారిగా ఉన్నప్పుడు మీ తల్లి వద్ద వారిని ఉంచి వచ్చారు.

ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అన్నప్పుడు కూడా ఆమె వద్ద సమాధానం లేదు.ఇంత మంది ఇన్ని రకాలుగా అంటున్నా కూడా కనీసం స్పందించకుండా నవ్వుతూనే ఉంది.అందరు ఏడుస్తున్నా కూడా అనసూయ మాత్రం నవ్వుతూ కనిపించడం విడ్డూరంగా ఉందంటూ అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.అనసూయ కు ఇన్నాళ్ల జబర్దస్త్‌ అనుబందం తెచ్చుకుంటున్నాను అనే బాధ కనీసం కనిపించడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

అనసూయ ప్రస్తుతం ఇంత స్టార్ డమ్‌ ను దక్కించుకుంది అంటే ఖచ్చితంగా అది జబర్దస్త్‌ వల్లే అనడంలో సందేహం లేదు.అయినా కూడా అనసూయకు విశ్వాసం లేదు అంటూ చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube