ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ( Jabardast Comedy Show )కి సంబంధించిన కమెడియన్స్ విషయం లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.గతం లో ఒకసారి బయటకు వెళ్లి పోయిన వారు మళ్లీ వచ్చిన దాఖలాలు లేవు.
కానీ ఇప్పుడు జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇస్తున్న వారు ఎక్కువ మంది అవుతున్నారు.చంటి రెండు మూడు సార్లు రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఇటీవల బిగ్ బాస్ కోసం అంటూ జబర్దస్త్ ని వీడిన ఫైమా ( Faima )ను మళ్లీ తీసుకు వచ్చారు.ఫైమా కి రీ ఎంట్రీ దక్కడం చాలా మందికి ఆశ్చర్యం ను కలిగిస్తోంది.

ఇక చమ్మక్ చంద్ర పక్కన చేసిన సత్య కి కూడా గతంలో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మొత్తానికి జబర్దస్త్ లో రీ ఎంట్రీ లు ఎక్కువ అవుతున్న నేపథ్యం లో ముందు ముందు మరింత మంది కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరింత మంది అక్కర్లేదు… మాకు సుధీర్( Sudheer ) మరియు అనసూయ ( Anasuya )రీ ఎంట్రీ ఇస్తే చాలు అన్నట్లుగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు.ఈ మధ్య కాలం లో జబర్దస్త్ కార్యక్రమం క్రేజ్ తగ్గింది.
అందుకే భారీ ఎత్తున రేటింగ్ రావాలి అంటే వారిద్దరు రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ చాలా బలంగా వాదిస్తున్నారు.మరి మల్లెమాల వారు పంతం వీడి వారిద్దరిని తీసుకు వస్తారా అనేది చూడాలి.

ఇద్దరికి కూడా మంచి టైమ్ ఉన్న సమయం లో జబర్దస్త్ కార్యక్రమం ను వీడిన విషయం తెల్సిందే.ఇక హైపర్ ఆది( Hyper Aadi ) ఈటీవీని వీడలేదు.కానీ జబర్దస్త్ కార్యక్రమం లో రావడం లేదు.అందుకే ఆయన కూడా రావాలంటూ అంతా కూడా కోరుకుంటున్నారు.మొత్తానికి జబర్దస్త్ కార్యక్రమం బాగు పడాలి అంటే వారిద్దరు రావాల్సిందే అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.కానీ వారిద్దరు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
ఒక వేళ మల్లెమాల వారు పిలిచినా కూడా వారు వస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది.సినిమాల కోసం వారు జబర్దస్త్ ని వీడిన విషయం తెల్సిందే.
అందుకే రీ ఎంట్రీ ఛాన్స్ వారికి ఉంటుందా అంటే అనుమానమే అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.కానీ ఇద్దరూ కూడా రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని చాలా మంది కోరుకుంటున్నారు.








