రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ రష్మీ గౌతమ్( Anchor Rashmi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షోతో( Jabardasth ) భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది రష్మీ.
కాగా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షో లతో పాటు పండుగ ఈవెంట్ లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది.ఇకపోతే నటిగా వెండితెరపై పలు సినిమాలలో నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి.
దాంతో నటిగా సక్సెస్ కాలేక పోయింది రష్మీ.ప్రస్తుతం ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు వరుసగ గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ యువతని ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా తన అందచందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది.అయితే యాంకర్ రష్మీ జబర్దస్త్ లో దాదాపు 10ఏళ్లుగా యాంకర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.జబర్దస్త్ షోలో ఎవరు ఎన్ని విధాలుగా తనపై కామెంట్ చేసినా పంచులు వేసినా కూడా నవ్వుతూ చాలా స్పోటివ్ గా తీసుకుంటూ ఉంటుంది.ముఖ్యంగా సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ) విషయంలో ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు ఆమెపై డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా పంచులు వేసిన విషయం తెలిసిందే.
తాజాగా కూడా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్( Bullet Bhaskar ) స్టేజ్ పై రష్మీ పై పంచులు వేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా రష్మి ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో( Bhola Shankar ) నటించిన విషయం తెలిసిందే.అందులో సెకండాఫ్‌లో చిరంజీవి ఎంట్రీ సీన్‌లో కాసేపు సందడి చేసింది రష్మి.చిరు, రష్మి మధ్య చిన్న రొమాంటిక్ కన్వర్జేషన్ ఉంటుంది.ఇందులో చిరంజీవితో( Chiranjeevi ) కలిసి రెచ్చిపోయింది రష్మి.కానీ ఆమె కాసేపట్లోనే మాయమవుతుంది.ఈ ఇద్దరి మధ్య సాంగ్ కూడా ఉంది.
కానీ మధ్యలోనే రష్మి వెళ్లిపోతుంది.అందులో పొట్టి స్కర్ట్ ధరించి, బ్లౌజ్ ముడేసి కనిపించింది రష్మి.రొమాంటిక్ మాటలతో కైపెక్కించేలా చేసింది.కానీ ఆమె కొద్ది సేపే ఉండటం ఆమె అభిమానులను నిరాశ పరిచింది.ఇంకాసేపు ఉంటే బాగుండనే ఫీలింగ్ కలిగించింది.

ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రష్మి ప్రస్తావన తీసుకొచ్చాడు కమెడియన్ బుల్లెట్ భాస్కర్. మీరు చిరంజీవితో సినిమా చేశారని, మిమ్మల్ని చూద్దామని సినిమాకెళ్లాను.ఫస్టాఫ్ మొత్తం కనిపించలేదు.
పోని సెకండాఫ్‌లో అయినా వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాను.తీరా సెకండాఫ్ ప్రారంభమయ్యే సమయంలో నా కట్చీఫ్ కింద పడిపోయిందని, అది కిందకి వంగి తీసుకునే లోపే రష్మి సీన్లు వచ్చిపోయాయి అంటూ సెటైర్లు వేసాడు.
దీంతో రష్మి ఏం చేయాలో తెలియక బిత్తరపోయింది.చిరునవ్వుతో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది.
ఇది షోలో నవ్వులు పూయించింది.అదే సమయంలో అందరి ముందు రష్మి పరువు తీసేశాడు బుల్లెట్ భాస్కర్.
ట్రోల్ చేసినా అది సరదాగానే కావడంతో రష్మి కూడా లైట్ తీసుకుంది.