అనసూయ మేడంని పట్టించుకోని టాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్... బుల్లి తెర వైపు చూపు!

ఇండస్ట్రీలో కింది స్థాయి నుండి ఎదిగిన వారిలో యాంకర్ అనసూయ( Anchor Anasuya ) కూడా ఒకరు.ఆమె ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో జాబ్ చేస్తూ అక్కడి నుండి ఇండస్ట్రీలో అడుగు పెట్టి బుల్లి తెరపై హీరోయిన్ స్థాయి గుర్తింపును దక్కించుకుంది.

 Jabardasth Anchor Anasuya Not Getting Film Offers , Anchor Anasuya, Jabardasth,-TeluguStop.com

జబర్దస్త్( Jabardasth ) అనగానే గుర్తుకు వచ్చేంతగా అనసూయ ముద్ర వేసింది అనడంలో సందేహం లేదు.బుల్లి తెరపై యాంకర్ గా జబర్దస్త్ అనసూయ చేసిన అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే.

బుల్లి తెర ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో నటించింది.

Telugu Anasuya, Anchor Anasuya, Jabardasth-Movie

వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంది.ముఖ్యంగా రంగస్థలం( rangasthalam ) సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అనసూయ జబర్దస్త్ కార్యక్రమంతో కూడా కొనసాగితే బాగుండేది.

కానీ వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నానని.దాంతో సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నందున జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేస్తున్నట్లు యాంకర్ అనసూయ ప్రకటించిన విషయం తెలిసిందే.

Telugu Anasuya, Anchor Anasuya, Jabardasth-Movie

ఎప్పుడైతే అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసిందో అప్పటి నుండి ఆమెకు సమస్యలు మొదలయ్యాయా అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది.ఆమె అభిమానులు కూడా బుల్లి తెరపై ఆమె కనిపించక పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించడం కంటే రెగ్యులర్ గా బుల్లి తెరపై కనిపిస్తేనే ఎక్కువ పాపులారిటీ మరియు ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నట్లు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ అనసూయ బుల్లితెరను వదిలేసింది.

వెండి తెరపై వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్న కూడా ఫిలిం మేకర్స్( Film makers ) అనసూయను లైట్ తీసుకుంటున్నారు.జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఆమెకు మంచి పాపులారిటీ ఉండేది.

కనుక ఆ పాపులారిటీ తమ సినిమాలకు ఉపయోగపడుతుందని చాలా మంది ఆమెను తీసుకునేందుకు ఆసక్తి చూపించే వారు.కానీ ఇప్పుడు జబర్దస్త్ లో ఆమె లేని కారణంగా సినిమాల్లో తక్కువ అవకాశాలు వస్తున్నాయి అనేది కొందరి మాట.అసలు విషయం ఏంటి అనేది ఆవిడకే తెలియాలి.బుల్లి తెరపై రీ ఎంట్రీ కోసం ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారంటూ కూడా పుకార్లు షికారులు చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube