మీకో జికె బిట్... రూ.100 నోటుపై ఉన్న పర్వతం పేరు ఏమిటి?

నిత్యం ఎన్నో విషయాలు మన కళ్ళముందు పాస్ అవుతున్నా మనకి పట్టదు.అసలు తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయము.

 Gk Bit What Is The Name Of The Mountain On Rs 100 Note Details, Latest News, Vir-TeluguStop.com

అటువంటివి అనేకమైనవి వున్నాయి.అలాంటి లిస్టులో ఒకటైన రూ.100 నోటుపై( Rs.100 Note ) ఉన్న పర్వతం( Mountain ) గురించి ఇపుడు తెలుసుకుందాం.ప్రస్తుతం భారతదేశంలో కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తోందనే విషయం అందరికీ విదితమే.భారతీయ కరెన్సీ గురించి చెప్పాలంటే అది ఈ రోజుది కాదు.

దాదాపు 2వేల సంవత్సరాల చరిత్ర ఉంది.ఇక భారతదేశంలో నాణేలు పురాతన కాలంనుండి ఉన్నప్పటికీ నోట్లు మాత్రం ఆ తర్వాతే వచ్చాయి.

Telugu Indian Currency, Kanchenjunga, Latest, Rs, Rs Mountain-Latest News - Telu

ఇక ఇప్పుడున్న ఇండియన్ కరెన్సీని గనక పరిశీలిస్తే చాలా మార్పులు కనిపిస్తాయి గానీ 1969లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లపై గాంధీ చిత్రాన్ని మొదటిసారిగా ముద్రించింది.ఈ ఫొటో బర్త్ సెంటెనరీ మెమోరియల్ డిజైన్.ఈ ఫోటోలో వెనుక వైపున సేవాగ్రామ్ ఆశ్రమం కూడా ఉంటుంది.మీరు గమనించారా? ఇంతకు ముందు ఈ నోట్‌పై అశోక స్తంభం చిత్రం ఉండేది.అయితే ఇపుడు రూ.100 రూపాయల నోటుపై కనిపించే పర్వతం ఏ పర్వతం ఫోటో అనేది చాలా మందికి తెలిసి ఉండదు.ఎందుకంటే ఇక్కడ అలాంటి విషయాలు పట్టించుకొనే సమయం ఎవరికుంటుంది కనుక.

Telugu Indian Currency, Kanchenjunga, Latest, Rs, Rs Mountain-Latest News - Telu

అయినా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.రూ.100 నోటుపై ప్రపంచంలోనే 3వ ఎత్తైన పర్వత శిఖరమైన కాంచన్‌జంగా( kanchenjunga ) అనే పర్వతం ఫోటో వుంది.ఈ ఫొటో భారతదేశంలోని అత్యంత అందమైన, చిన్న రాష్ట్రమైన సిక్కింలోని పెల్లింగ్ నుంచి తీసుకోవడం గమనార్హం.కాంచన్‌జంగా పర్వతాన్ని నేపాలీ భాషలో కాంచన్‌జంగా అని, ఇంగ్లీషులో కంచన్‌జాఘా అని, లింబు భాషలో సేవాలుంగ్మా అని పిలుస్తారు.ఈ పర్వతం భారతదేశంలోని సిక్కిం రాష్ట్రానికి వాయువ్యంగా నేపాల్ దేశ సరిహద్దులో కలదు.అంతేకాదండోయ్… కాంచన్‌జంగా ప్రపంచంలోనే 3వ అత్యంత ఎత్తైన పర్వతం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube