జబర్దస్త్( Jabardasth ) షో వల్ల హీరోయిన్ రేంజ్ గుర్తింపు దక్కించుకున్న అనసూయ( Anasuya ) ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అంటూ స్వయంగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు.జబర్దస్త్ షో కారణంగా స్టార్ డమ్ దక్కించుకున్న అనసూయ.
ఆ షో ను వీడటం వల్ల స్టార్ డమ్ కోల్పోయింది.జబర్దస్త్ చేస్తున్న సమయంలో ఉన్న ఆఫర్లతో పోల్చితే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఆఫర్లు చాలా తక్కువ అని చెప్పాలి.

ఒకప్పుడు హీరోయిన్ రేంజ్ లో ఆఫర్లు ఉండేవి.కానీ ఇప్పుడు మాత్రం అంత సీన్ లేదు నీకు అన్నట్లుగా ఫిల్మ్ మేకర్స్ ఈమెను చూసి పెదవి విరుస్తున్నారట.దాంతో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఎంత చేసినా కూడా ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు.సోషల్ మీడియా లో అనసూయ అందాల విందు ఎంత చేసినా కూడా ఆఫర్లు మాత్రం రావడం లేదు.
ఏం చేసినా కూడా గొప్ప సినిమా ల్లో ఛాన్స్ లు రావడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పుష్ప 2 ( Pushpa2 )సినిమా లో అనసూయ పాత్ర ఎంత వరకు ఉంటుంది.

ఆ పాత్ర వల్ల అను కెరీర్ మళ్లీ పుంజుకుంటుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేవలం అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ను వీడటం వల్లే సినిమా ల్లో ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అనసూయ స్వయంకృత అపరాథం అంటూ విమర్శిస్తున్నారు.వరుసగా సినిమా ల్లో నటించే అవకాశాలు రాకున్నా కూడా అప్పుడప్పుడు అయినా ఐటం సాంగ్స్ తో… సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా ఆఫర్లు దక్కించుకుంటే బాగుంటుందని కొందరు అంటున్నారు.మొత్తానికి అనసూయ సినీ కెరీర్ నాశనం అయినట్లే అంటూ నెటిజన్స్ కొందరు మాట్లాడుకుంటున్నారు.
కానీ ఆమె మాత్రం మళ్లీ పుంజుకుంటాను అన్నట్లుగా నమ్మకంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో అదరగొట్టేస్తోంది.