జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయిన విషయం తెలిసిందే.జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం వెండితెరపై అలరిస్తూ దూసుకుపోతున్నారు.
కాగా జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ కెవ్వు కార్తిక్( Comedian Kevvu Karthik ) కూడా ఒకరు.జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లు ప్రేక్షకులను కడుపుబ్బాని నవ్విస్తూ ఉంటారు కెవ్వు కార్తీక్.
మొదట మిమిక్రితో కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ తో మంచి కమెడియన్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కెవ్వు కార్తీక్.కాగా ప్రస్తుతం కమెడియన్‌గా పలు టీవీ షోలు, సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తూ వస్తున్నారు.
ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని కూడా మొదలు పెట్టారు.ఇకపోతే కార్తీక్ తల్లి( Karthik Mother ) ఆరోగ్య పరిస్థితి గురించి మనందరికీ తెలిసిందే.గతంలో చాలా రకాల ఈవెంట్ లో తన తల్లిని అందరికీ పరిచయం చేయడంతో పాటు తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.కాగా కార్తీక్ తల్లి గత ఐదేళ్లుగా కాన్సర్ తో( Cancer ) పోరాడుతూ వస్తున్నారు.2019 మార్చి 19న ఆమెకు క్యాన్సర్ ఉందని తెలిసిందట.ఇక అప్పటి నుంచి ఆ రోగం పై అలుపెరగని పోరాటం చేస్తూ వస్తున్నారట.
ఈ ఐదేళ్లలో ఏన్నో సర్జరీలు, మరెన్నో కిమొథెరపీలతో పాటు ఎన్నో నిద్రలేని రాత్రులు, భరించలేని బాధలు పడినట్లు కార్తీక్ చెప్పుకొచ్చారు.
ఇన్నాళ్లలో తమ పరిస్థితి అర్ధంకాని అగాధంలో పడ్డ భవిషత్తులా, చీకట్లో గమ్యం తెలియని ప్రయాణంలా ఉందని.కానీ అన్నింటికీ తన తల్లి ఆత్మస్థైర్యమే సమాధానంగా నిలిచిందని పేర్కొన్నారు.క్యాన్సర్ పై అలుపెరుగని పోరాటం చేస్తున్న తన తల్లి ఒక యోధురాలని కార్తీక్ గొప్పగా చెప్పుకొచ్చారు.
ఇక తన తల్లి చేస్తున్న పోరాటానికి ధైర్యంగా నిలిచిన డాక్టర్స్ అందరికి తన పాదాభివందనాలు తెలియజేసారు.అలాగే తన తల్లి క్యాన్సర్ నుంచి కోలుకోవాలని కోరుకుంటూ.తన బాధని వ్యక్తం చేసారు.ఇన్నాళ్ల నుంచి తన తల్లి చేస్తున్న పోరాటాన్ని ఒక వీడియోగా కార్తీక్ పోస్టు చేసారు.
ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కార్తీక్ కి ధైర్యం చెబుతున్నారు.