2024 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్.. ఎన్ని రాబోతున్నాయంటే?

సంక్రాంతికి (Sankranti) ప్రతీ ఏడాది బిగ్గెస్ట్ క్లాష్ అనేది ఉండడం సహజమే.ఎప్పుడో ఒకసారి మాత్రమే స్టార్ హీరోలు సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేయలేదు.

 Its Ram Charan Vs Mahesh Babu Vs Prabhas At Box Office Clash Details, Ram Charan-TeluguStop.com

మరి 2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.

మరి 2024 సంక్రాంతి (Sankranti 2024) ఫైట్ కోసం ఇప్పటి నుండే వార్ మొదలయ్యింది.

వచ్చే ఏడాది పండుగకు బిగ్గెస్ట్ క్లాష్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.ముందుగా 2024 సంక్రాంతి సీజన్ లో స్లాట్ ను రిజర్వ్ చేసుకుంది మాత్రం డార్లింగ్ ప్రభాస్ అనే చెప్పాలి.

ప్రభాస్ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కే’ (Project K) ఒకటి.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Telugu Game Changer, Indian, Kamal Haasan, Mahesh Babu, Nag Ashwin, Prabhas, Pro

పాన్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమా తర్వాత నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న SSMB28 కూడా సంక్రాంతి రిలీజ్ అంటూ అఫిషియల్ గా ప్రకటించి తమ స్లాట్ ను రిజర్వ్ చేసుకున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.

Telugu Game Changer, Indian, Kamal Haasan, Mahesh Babu, Nag Ashwin, Prabhas, Pro

ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమా కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”గేమ్ ఛేంజర్”(Game Changer) .ఈ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.అయితే ఈ రోజు చరణ్ పుట్టిన రోజు కానుకగా టైటిల్ అయితే ప్రకటించారు కానీ రిలీజ్ డేట్ ఏం చెప్పక పోవడంతో ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ లో ఉంది.

Telugu Game Changer, Indian, Kamal Haasan, Mahesh Babu, Nag Ashwin, Prabhas, Pro

ఈ సినిమాకు బదులుగా శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 (Indian 2) సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.ఏది ఏమైనా ప్రస్తుతానికి అయితే ప్రభాస్, మహేష్ సినిమాలు అనౌన్స్ మెంట్ తో రెడీ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube