అక్కినేని యువ హీరోల్లో నాగ చైతన్య( Naga Chaitanya ) ఒకరు.అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగిన చైతూ తన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు.
అయితే గత రెండు సినిమాలతో ఈయన మళ్ళీ ప్లాపుల బాట పట్టారు.థాంక్యూ, హిందీ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చద్దా ప్లాప్ అయ్యాయి.

ఇక ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన కస్టడీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఇలా వరుసగా ప్లాప్స్ తోనే దూసుకు పోతున్న చైతు ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టుకున్నాడు.అయితే ఈ సినిమా భారీ తారాగణంతో భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతుంది.దీంతో ఈసారి హిట్ ఖాయం అంటున్నారు.ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలను తెరకెక్కించిన చందు మొండేటి, నాగ చైతన్య జోడీ మరోసారి కలవబోతుంది.ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోగా ఇప్పుడు మూడవ సినిమా ఈ కాంబోలో ఫిక్స్ అయ్యింది.
ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించనున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి( Sai Pallavi ) నటించ బోతున్నట్టు వార్తలు గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

మరి ఈ వార్తలను నిజం చేస్తూ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.సాయి పల్లవి, చైతు జోడీ అంటే ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది.ఇక NC23 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ను ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చారు.ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే షూట్ జరుపు కుంటుందని తెలిపారు.
ఇప్పటికే ఈ కాంబో లవ్ స్టోరీ సినిమా( Love Story )తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది.ఈసారి కూడా బ్లాక్ బస్టర్ ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు.







