సంజయ్ తో విబేధాల పై రాజేందర్ క్లారిటీ ! పార్టీ మార్పుపైనా...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మధ్య.

ఈ మధ్య కాలంలో విబేధాలు పెరిగాయని ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా ఈటెల రాజేందర్ సొంత అజెండాతో ముందుకు వెళుతున్నారని,  దీనిపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉండడంతోపాటు,  అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం చాలా రోజుల నుంచి వస్తూనే ఉంది.

  దీనికి తగ్గట్లుగానే రాజేందర్ వ్యవహారం ఉండటం , కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ కు రాజేందర్ మద్దతు పలకడం,  అప్పటికే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు అంత దూరంగా ఉండాలి అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చినా,  రాజేందర్ పట్టించుకోకపోవడంతో వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి పెరిగిపోయాయని ప్రచారం జరుగుతోంది.దీనిపై తాజాగా ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈరోజు లక్డీకాపూల్ లోని హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించి అనేక వ్యాఖ్యలు చేశారు.తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని , కాంగ్రెస్ లోకి వెళుతున్నట్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈటెల రాజేందర్ మండిపడ్డారు .అంతేకాదు తాను బీజేపీలో మనస్ఫూర్తిగా కొనసాగుతున్నానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో తనకు ఎటువంటి విబేధాలు లేవని , కొంతమంది నాయకులు పనిగట్టుకుని తమ మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.హుజూరాబాద్ నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అని,  పార్టీ ఆదేశిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ పైన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ రాజేందర్ ఈ సందర్భంగా ప్రకటించారు.

రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ నాయకులు నమ్మకం కోల్పోయారని రాజేందర్ కామెంట్ చేశారు.

Advertisement

కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే టీఆర్ఎస్ కు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,  నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయి అంటూ మండిపడ్డారు.ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి టీఆర్ఎస్ లో ఇంకా చాలామంది నాయకులు కొనసాగుతున్నారని,  భవిష్యత్తులో వారంతా బీజేపీలో చేరుతారని రాజేందర్ జోస్యం చెప్పారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు