తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు హాజరైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు.గతంలో తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా చెలామణి అవుతున్నారని ఆరోపించారు.
గతంలో తెలంగాణను వ్యతిరేకించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడుతూ అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు.