పూట గడవడమే కష్టంగా ఉండేది... రాజమౌళి కుటుంబం ఇన్ని కష్టాలను అనుభవించారా?

It Was Difficult To Pass The Time Did Rajamoulis Family Suffer So Much, Keeravani, RRR, Rajamouli, Oscar, Vijayendra Prasad, Shivashakti Dutta

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్(RRR).ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఆస్కార్(Oscar) అవార్డు గెలుచుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచిపోయిందని చెప్పాలి.

 It Was Difficult To Pass The Time Did Rajamoulis Family Suffer So Much, Keeravan-TeluguStop.com

ఇలా ఆస్కార్ రావడానికి కీరవాణి (Keeravani)రాజమౌళి (Rajamouli)పాత్ర ఎంతో ఉందని చెప్పాలి ఇలా ఆస్కార్ వేదికపై సందడి చేసినటువంటి కీరవాణి రాజమౌళి ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించారని చాలామందికి తెలియదు.

తాజాగా కీరవాణి తండ్రి శివశక్తి దత్త( Shivashakti Dutta ) ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలో ఆయన ఒకప్పుడు తమ కుటుంబం అనుభవించిన పేదరికం గురించి తెలియజేశారు.మొత్తం తాము నలుగురు అన్నదమ్ములమని తెలిపారు.తుంగభద్ర తీరానికి వలస వెళ్ళాం.16 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నాము.అక్కడ నేను 300 ఎకరాల పొలం కొన్నాము.అయితే చిన్నప్పటినుంచి సినిమాలపై పిచ్చి ఉండడంతో సినిమాల కోసమే ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నామని ఈయన తెలియజేశారు.ఇలా ఆస్తులు పోవడంతో రోజు గడవడం కూడా కష్టంగా మారి కటిక పేదరికం అనుభవించామని తెలిపారు.

కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర పనిచేసేవాడు.కీరవాణి సంపాదనే మమ్మల్ని బ్రతికించింది.కీరవాణి ప్రతిభ కలవాడు చిన్నప్పటినుంచి తనకు సంగీతంపై ఆసక్తి ఉండడంతో తనకి సంగీతం నేర్పించానని ఆయన తెలియజేశారు.

నేను తమ్ముడు విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) కలిసి కథారచయితలుగా పని చేశాము.జానకిరాముడు, కొండవీటి సింహం వంటి హిట్ చిత్రాలకు కథలు అందించామని చెప్పుకొచ్చారు.ఇలా ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించినటువంటి రాజమౌళి కీరవాణి నేడు ఆస్కార్ స్థాయి వరకు వెళ్లడం నిజంగా గర్వించదగ్గ విషయం అంటూ ఈ సందర్భంగా కీరవాణి తండ్రి తెలియజేశారు.ఇలా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Video : Keeravani,RRR,Rajamouli,Oscar #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube