అమరావతి: బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి.పాఠ్య పుస్తకాల విషయంలో జాప్యం జరిగిన మాట వాస్తవం.
పాఠశాల విద్యాశాఖ ఓ కఠిన నిర్ణయం తీసుకున్న కారణంగానే ఈ ఆలస్యం.ప్రభుత్వం ఇచ్చిన సిలబస్, కరిక్యులమ్ ఇచ్చిన తర్వాత ఏ ప్రైవేటు పాఠశాల దాన్ని మార్చేందుకు వీల్లేదు.
గతంలో ప్రైవేటు పాఠశాలలు తమ సబ్జెక్టులు కూడా కలిపేసి ముద్రించే వారు.పరీక్షలు ఎప్పుడూ ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ఆధారంగానే జరుగుతాయని గుర్తించాలి.
వ్యాపారం కోసం గతంలో ప్రైవేటు సంస్థలు ముద్రించేసి వాటినే విక్రయించుకునే వారు.ప్రభుత్వం ఇచ్చిన పుస్తకాలను మాత్రమే పంపిణీ చేసేలా ఈ సారి నిర్ణయం తీసుకున్నాం.
ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇస్తున్నాం, ప్రైవేటు పాఠశాలలకు నిర్దేశిత ధరకే విక్రయిస్తున్నాం.ప్రభుత్వం అంటే విశ్వాసం లేకే ఈ యాజమాన్యాలు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నాయి.విద్యార్ధుల సంఖ్యకు డిమాండ్ కు స్పష్టమైన వివరాలు చెప్పకపోవటం వల్లే ఈ గ్యాప్ వచ్చింది.పాఠశాలలపై ప్రభుత్వ విధానాన్ని వద్దనే అధికారం ఉపాధ్యాయులకు ఎక్కడిది.
ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారా.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకే సంస్కరణలు చేపట్టాం.
రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణల యజ్ఞం ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుంది.సీబీఎస్ఈ , ఆంగ్ల మాధ్యమంలో బోధన , డిజిటల్ క్లాస్ రూమ్ లు ఇలా వేర్వేరు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఉపాధ్యాయులు చెబుతున్న వివిధ అంశాలు ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగం.పాఠశాలల విలీనంపై విద్యార్దుల తల్లితండ్రులూ అభ్యంతరం చెప్పటం లేదు.ఎవరో కుట్రలు చేసి ఈ విధానాన్ని అడ్డుకోవాలనే కుట్ర చేస్తున్నారు.
5 వేల 600 పైచిలుకు పాఠశాలలు మ్యాపింగ్ చేస్తే కేవలం 268 పాఠశాలకు మాత్రమే దూరం అని భావిస్తున్నారు.