తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పేషీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెళ్లారు.ఈ క్రమంలోనే రాష్ట్ర హైకోర్టు తీర్పు కాపీని అందజేశారు.
ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదని కృష్ణమోహన్ రెడ్డిపై న్యాయస్థానం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తనను గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గుర్తించాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ స్పీకర్ పేషీలో హైకోర్టు తీర్పు కాపీని అందించినట్లు తెలిపారు.హైకోర్టు తీర్పును అమలు చేయాలన్న డీకే అరుణ ముందుగా సమాచారం ఇచ్చినా స్పీకర్, కార్యదర్శి లేకపోవడం బాధాకరమని వెల్లడించారు.