ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజున పుట్టిన బాలీవుడ్ నటి మధుబాలకు అభిమానులు ఇప్పటికీ లెక్కలేనంత మంది ఉన్నారు.ఆమెను బాలీవుడ్ మార్లిన్ మన్రో అని పిలుస్తారు.ఆమె 16 సంవత్సరాల వయస్సులో ప్రజాదరణ పొందింది.18వ ఏట ప్రేమలో పడింది.23 సంవత్సరాల వయస్సులో, ఆమె ప్రేమకు దూరమయ్యింది.27 సంవత్సరాల వయసులో కెరీర్ లో ఉన్నత స్థితిని చూసింది… ఆమె 36 సంవత్సరాల వయస్సులో ప్రపంచాన్ని విడిచిపెట్టింది.1942 నుంచి 1962 వరకు తన 20 ఏళ్ల కెరీర్‌లో మధుబాల దాదాపు 70 సినిమాల్లో నటించింది.మధుబాల చిన్ననాటి పేరు ముంతాజ్ జహాన్ డెహ్ల్వి.
ఆమె తన 11 మంది తోబుట్టువులలో ఐదవది.ఆమె తండ్రి పేరు అతావుల్లా ఖాన్.
తల్లి అయేషా బేగం.ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది.మధుబాల తొలిసారిగా 1942లో బసంత్ అనే చిత్రంలో నటించారు.అప్పటికి ఆమె వయసు 9 సంవత్సరాలు.దేవికా రాణి సలహా మేరకు ముంతాజ్ తన పేరును మధుబాలగా మార్చుకుంది.1947 తర్వాత ఆమెకు సినిమాల్లో మధుబాల అనే పేరు వచ్చింది.

14 సంవత్సరాల వయస్సులో మధుబాల నీల్ కమల్ చిత్రంలో రాజ్ కపూర్‌తో కలిసి నటించింది.1949లో కమల్ అమ్రోహి తీసిన ‘మహల్’ సినిమా విజయం మధుబాలని స్టార్‌గా మార్చింది.మధుబాల కెరీర్‌లో చాలా సూపర్ హిట్ చిత్రాలు దిలీప్ కుమార్, కిషోర్ కుమార్‌లతో కూడా వచ్చాయి.ఇద్దరితోనూ మధుబాలకు ఎఫైర్ ఉందనే వార్తలు వినిపించాయి.ఆమె కుమార్‌ని కూడా పెళ్లి చేసుకుంది.1960లలో మధుబాలకు ప్రమాదకరమైన వ్యాధి వచ్చింది.పెళ్లయ్యాక చికిత్స కోసం లండన్ వెళ్లింది.మధుబాలను పరీక్షించిన తర్వాత ఆమె రెండేళ్లు మాత్రమే బతకగలదని లండన్ డాక్టర్ చెప్పారు.మధుబాల గుండెలో రంధ్రం ఏర్పడింది.ఫలితంగా ఆమె శరీరంలో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యింది.
ఈ వ్యాధి ముందు వైద్యులు కూడా తమ ఓటమిని అంగీకరించారు.దీంతో మధుబాల నటన నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
దిలీప్ కుమార్‌తో విఫలమైన ప్రేమ, కిషోర్ కుమార్‌తో వివాహం తర్వాత విడాకులు, బాధాకరమైన అనారోగ్యం, తన కలలను వదులుకోవడం.మధుబాల ఫిబ్రవరి 23, 1969న 36 ఏళ్ల వయసులో మరణించింది.
మధుబాల జీవితాన్ని హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోతో పోలుస్తుంటారు.ఒకప్పుడు బాలీవుడ్ క్వీన్‌గా వెలుగొందిన మధుబాల.
అనారోగ్యంతో చనిపోయే దశకు చేరుకున్నా.ఆమె పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియకపోవడం విశేషం.







