భారతీయులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్ .. అందుబాటులోకి ‘ఈ-వీసా’, దరఖాస్తు ఎలా అంటే?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే తదితర దేశాలు ఇప్పటికే భారతీయులతో కిక్కిరిసిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్తగా తమకు అనుకూలంగా ఉన్న దేశాలను అన్వేషించే పనిలో భారతీయులు ఉన్నారు.మనకు అత్యంత సన్నిహిత దేశమైన ఇజ్రాయెల్‌లోనూ( Israel ) భారతీయ వలసల సంఖ్య పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ టూరిజం మంత్రిత్వ శాఖ (ఐఎంవోటీ) భారతీయ ప్రయాణీకుల కోసం డిజిటల్ ఈ- వీసా( e-Visa ) వ్యవస్ధను ప్రవేశపెట్టింది.ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది.

కొత్త విధానంలో వ్రాతపనిని తొలగిస్తూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.పర్యాటక సౌలభ్యాన్ని పెంపొందించడానికి, భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ నిబద్ధతలో ఇది కీలకమైన దశను సూచిస్తుంది.

Advertisement

ఈ-వీసా ఫ్లాట్‌ఫాం ద్వారా భారతీయులు( Indians ) పూర్తిగా ఆన్‌లైన్‌లో వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తుదారులు ఇజ్రాయెల్ అధికారిక ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.సిస్టమ్‌లో డాక్యుమెంటేషన్ అవసరాలు తగ్గాయి, ఇది వ్యక్తిగత పర్యాటకులకు( Tourists ) ప్రత్యేకంగా సౌకర్యవంతంగా ఉంటుంది.

అయితే గ్రూప్ వీసా దరఖాస్తులను మాత్రం సంప్రదాయ పద్ధతుల ద్వారానే ప్రాసెస్ చేస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ-వీసా ఫ్లాట్‌ఫాంను ఇజ్రాయెల్ ఎంట్రీ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ) సిస్టమ్‌తో అనుసంధానించారు.ఇజ్రాయెల్ పర్యాటక రంగానికి భారతదేశం కీలక మార్కెట్ అన్న సంగతి తెలిసిందే.2018లో 70,800 మంది భారతీయ సందర్శకులకు ఆతిథ్యం ఇవ్వగా.కోవిడ్ 19 విజృంభణతో ఈ జోరుకు అంతరాయం ఏర్పడింది.2022 నుంచి తిరిగి భారతీయులు కోలుకోవడం ప్రారంభించారు.ఆ ఏడాది 30,900కి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌ను సందర్శించినట్లు అంచనా.2023లో 41,800 మంది , 2024లో జనవరి నుంచి అక్టోబర్ మధ్య 8,500 మంది భారతీయులు ఇజ్రాయెల్‌కు వచ్చినట్లు ఆ దేశ పర్యాటక శాఖలోని ఇండియా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అమృత బంగేరా ఇటీవల మీడియాకు వివరించారు.ప్రస్తుతం భారతీయ పౌరులకు మాత్రం ఈ- వీసా విధానం అందుబాటులో ఉండగా.

దీనిని విదేశీ ప్రయాణీకులందరికీ విస్తరించాలని ఇజ్రాయెల్ పర్యాటక శాఖ భావిస్తోంది.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?
Advertisement

తాజా వార్తలు