అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్ చీఫ్ అబూబాకర్ బాగ్దాదీ ఆపరేషన్ కైలా ముల్లర్ లో భాగంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఐసిస్ కు కొత్త చీఫ్ ఎవరు అన్న దానిపై ఒక వార్త హల్ చల్ చేస్తుంది.
అదే ఐసిస్ కొత్త చీఫ్ గా ఒకప్పుడు సద్దాం హుస్సేన్ వద్ద మిలిటరీ అధికారిగా విధులు నిర్వర్తించిన అబ్దులా ఖర్దాష్ భాద్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది ఆగస్టు లో జరిగిన ఆపరేషన్ కైలా ముల్లర్ లో భాగంగా బాగ్దాదీ హతమైన విషయం విదితమే.ఈ ఏడాది ఆగస్టు లో డెల్టాఫోర్స్ కమెండోల హెలికాప్టర్లు సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతానికి చేరుకోగా బగ్దాదీ బస చేసిన భారీ భవంతి సమీపానికి రాగానే హెలికాప్టర్ల పైకి కింది నుంచి తుపాకీ గుళ్ల వర్షం కురిసింది.దీనితో అప్రమత్తమైన కమెండోలు తమ తుపాకులకు పనిచెప్పి నిమిషాల్లోనే గ్రౌండ్ ‘క్లియర్’ చేసేశారు.
అనంతరం గోడను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టారు.అయితే వారిలో కొందరు లొంగిపోగా,కొందరు కమెండో ల కాల్పుల్లో మృతి చెందారు.
అయితే అప్పటికే పరిస్థితి ని గమనించిన బాగ్దాదీ ఇక చేయి దాటి పోయింది అన్న సమయంలో తన ముగ్గురు పిల్లలను తీసుకొని ఒక సొరంగం లోకి పరుగులు తీశాడు.అయితే దానిని గమనించిన కమాండో లు జాగిలాల ను వదలడం తో ఓ వైపు యమదూతల్లా వెంటాడుతున్న జాగిలాలు! చెవుల్లో మార్మోగుతున్న వాటి అరుపులు! సొరంగంలో మరింత ముందుకెళ్తే మార్గం లేదు.