వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్-వెస్టిండీస్( India-West Indies ) మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు జరిగిన సంగతి తెలిసిందే.తొలి వన్డేలో భారత్ అద్భుత ఆటను ప్రదర్శించి ఘన విజయం సాధించింది.
రెండో వన్డే మ్యాచ్లో అటు బ్యాటింగ్ లోను, ఇటు ఫీల్డింగ్ లోను విఫలమై ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంది.ప్రస్తుతం సిరీస్ 1-1 గా ఉంది.
రేపు జరిగే వన్డే మ్యాచ్లో గెలిచిన జట్టు టైటిల్ కైవసం చేసుకొనుంది.

ఇక ఇప్పుడిప్పుడే కెరియర్ ప్రారంభించిన ఇషాన్ కిషన్ ( Ishan Kishan )జరిగిన రెండు వన్డే మ్యాచ్లలోను అర్థ సెంచరీలతో రాణించాడు.కానీ భారీ స్కోరుగా మలచడంలో ఇషాన్ కిషన్ కాస్త విఫలం అయ్యాడు.కానీ ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు.
ఏకంగా సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) ను అధిగమించి ఒక అరుదైన ఘనత సాధించాడు.తొలి 5 వన్డే మ్యాచ్లలో 348 పరుగులతో ఓపెనర్ గా అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ నే అధిగమించాడు.

సచిన్ టెండుల్కర్ తొలి 5 వన్డే మ్యాచ్లలో 321 పరుగులు చేశాడు.శుబ్ మన్ గిల్ 320, క్రిస్ శ్రీకాంత్ 261 పరుగులతో ఉన్నారు.ఇషాన్ కిషన్ బ్యాక్ టు బ్యాక్ అర్థ సెంచరీలతో మహేంద్రసింగ్ ధోని రికార్డును సమం చేశాడు.వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఇషాన్ కిషన్ 55 పరుగులు, శుబ్ మన్ గిల్ 34 పరుగులతో శుభారంభం చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో భారత జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.
ఇక బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.మిగతా బౌలర్లు రాణించి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదేమో.రేపు జరిగే మూడో వన్డే మ్యాచ్లో భారత్ బ్యాటింగ్, ఫీల్డింగ్ లో రాణిస్తేనే టైటిల్ సొంతం అవుతుంది.





 

