టాలీవుడ్ లో ప్రత్యేకమైన చరిత్ర ఉన్న బ్యానర్ వైజయంతి( Vijayanti ).ఈ బ్యానర్ లో ఎన్నో సంచలన సినిమాలు వచ్చాయి.
ముఖ్యంగా వైజయంతి సినిమా నుంచి సినిమా అంటే అది మే నెలలో రిలీజ్ పక్కా ఉంటుంది.అప్పట్లో రిలీజైన జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి మహానటి( Mahanati ) వరకు వారు నటించిన సినిమాలు మే నెలలో రిలీజ్ అయితే పక్కా సెన్సేషనల్ హిట్ అవుతాయి.
అయితే లాస్ట్ ఇయర్ ఆగష్టులో రిలీజ్ చేసిన సీతారామం కూడా సూపర్ హిట్ అయ్యింది.

అయితే మరోసారి వైజయంతి బ్యానర్ మే సెంటిమెంట్ ఫాలో అవుతుంది.వారు లేటెస్ట్ గా నిర్మించిన అన్నీ మంచి శకునములే సినిమా మే 18న రిలీజ్ చేస్తున్నారు. సంతోష్ శోభన్( Santosh Shobhan ), మాళవిక నాయర్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు.
మరి మే నెల సెంటిమెంట్ ఈ సినిమాకు కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.సంతోష్ శోభన్ మాత్రం ఈమధ్య వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు బ్యానర్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే హీరో ఒడ్డున పడినట్టే లెక్క.
ఈ సినిమా ఏం చేస్తుందో చూడాలి.







