జగన్ నిర్ణయం పై వంశీ మనస్థాపం చెందారా ? అందరికీ దూరంగానే ...? 

గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.టిడిపి నుంచి 2019 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన వంశీ ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో వైసిపి కి అనుబంధంగా కొనసాగుతున్నారు.

 Is Vamsi Satisfied With Jagan's Decision? Away From Everyone Vallabaneni Vamsi,-TeluguStop.com

టిడిపిలోనే ఉంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు , లోకేష్ పైన సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూ తిట్టిపోస్తు ఉంటారు.వైసీపీలో చేరకపోయినా,  వైసీపీ అనుబంధ సభ్యుడు గానే ఆయన కొనసాగుతూ వస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు నేపథ్యంలో వంశీ పూర్తిగా నియోజకవర్గ ప్రజలకు,  తన అనుచరులకు అందుబాటులో లేకుండా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశం గా మారింది.
     అసలు వంశీ ఈ విధంగా సైలెంట్ అయిపోవడానికి కారణం వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే కారణంగా తెలుస్తోంది .ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడంపై వంశీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.వంశీనే కాదు,  మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం జగన్ నిర్ణయం పై అసంతృప్తితో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

  తన అనుచరులకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా సైలెంట్ అయిపోవడానికి ఇదే కారణంగా తెలుస్తోంది.  ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు సమయంలో  కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు వచ్చే విధంగా నాని , వంశీ గట్టిగానే కృషి చేశారు.

కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో  పేరు మార్చవద్దని వీరు జగన్ ను కోరినా జగన్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
 

  అంతేకాకుండా అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో జగన్ అసెంబ్లీలో వివరించారు.అయినా వంశీ మాత్రం ఈ విషయంలో అసంతృప్తితోనే ఉన్నారట.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్న ప్రాంతం గన్నవరం నియోజకవర్గంలోకి రావడం,  ఈ విషయంలో అనుచరులు నియోజకవర్గ ప్రజల నుంచి ఒత్తిళ్లు , విమర్శలు రావడం తదితర కారణాలతో పొలిటికల్ గా వంశీ సైలెంట్ గా ఉంటూ ఎవరికి అందుబాటులో ఉండేందుకు ఇష్టపడడం లేదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube