సంయుక్త మీనన్‌ ను ఇంకా కూడా వారు పట్టించుకోవడం లేదా?

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా( Bheemla Nayak )లో ముఖ్య పాత్రలో నటించిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెలుగు లో దక్కించుకుంది.

చాలా కాలంగా ఇతర భాషల్లో నటిస్తున్నప్పటికీ సంయుక్త మీనన్‌ ఆ పేక్షకులు పెద్దగా ఆదరించలేదు.

అభిమానించలేదు.కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సంయుక్త మీనన్( Samyuktha Menon ) కి ఫిదా అయ్యారు.

అందుకే భీమ్లా నాయక్ సినిమాలో తను పోషించిన పాత్ర చిన్నదే అయినా కూడా ఆదరించారు.ఆ సినిమా తర్వాత బింబిసారా, సార్ చిత్రాల్లో నటించి వరుసగా విజయాలను సొంతం చేసుకుంది.

తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం( Virupaksha ) విడుదల అయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా లో కూడా సంయుక్త హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Advertisement

దాంతో సంయుక్త టాలీవుడ్ లో మరింత బిజీ అవ్వడం ఖాయం గా కనిపిస్తోంది.

మొన్నటి వరకు కోటి లోపు ఉన్న తన రెమ్యూనరేషన్ ని ఏకంగా రెట్టింపు చేసిందని వార్తలు కూడా వస్తున్నాయి.యంగ్ హీరోలు చాలా మంది సంయుక్త తో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.విరూపాక్ష చిత్రం ఇటీవల విడుదల అయిందో లేదో అప్పుడే మెగా హీరో సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) తన తదుపరి సినిమా లో కూడా సంయుక్త మీనన్ ని నటింపజేయాలని భావిస్తున్నాడట.

మరో వైపు టైర్ 2 హీరోలు చాలా మంది కూడా సంయుక్త మీనన్‌ కలిసిన నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.అయితే ఇన్ని సినిమాలు వరుసగా సక్సెస్ అవుతున్నా కూడా స్టార్ హీరోలు మాత్రం ఈ ముద్దు గుమ్మను పట్టించుకోవడం లేదు.

అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు ఇంకా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది.అప్పుడు స్టార్ హీరోల దృష్టి ఈమె పై పడుతుందేమో చూడాలి.ఈ సమయంలో కెరియర్ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్( Most Wanted Heroine ) గా సంయుక్త నిలిచే అవకాశం ఉంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

అలా కాదని ఏ చిన్న అవకాశానికి పడితే ఆ చిన్న అవకాశానికి ఓకే చెబితే స్టార్ హీరోలు ఏమైనా లైట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ఈ విషయాలు ఆమెకు ఎవరైనా చెబితే బాగుంటుంది.

Advertisement

లేదంటే ఆమె ఐనా కాస్త ఆలోచిస్తే బాగుంటుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు