పూరీజగన్నాథ్( Puri Jagannath ) పేరు కి పరిచయం అవసరం లేదు ఆయన చాలా సినిమాలు తీసి విజయం సాధించారు ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోలందరి హిట్లు ఇచ్చాడు.అలాగే చాలా వేగంగా సినిమాలు తీస్తాడనే పేరు తెచ్చుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.
పూరీ కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు.ఇక వారిలో యాక్టర్లలో రవితేజ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌తోపాటు రామ్ పోతినేని ఉన్నారు.
ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు రికార్డుల గురించి జోరుగా చర్చ నడుస్తుంది.అయితే గతేడాది మాత్రం సీన్ రెవెర్స్ ఐంది.
రౌడీ తో గతేడాది పాన్ ఇండియా రేంజ్‌లో ‘లైగర్’ రూపొందించినప్పటికీ మూవీ డిజాస్టర్ కావడం పూరీని కోలుకోలేని దెబ్బకొట్టింది.ఆ తరువాత లైగర్ బయ్యర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూ నెట్టింట వైరల్ గామారింది.
ఇక ఈ దెబ్బతో విజయ్‌తో ఆల్రెడీ స్టార్ట్ అయిన ‘జనగణమన’ ( Janaganamana )కూడా ఆగిపోయింది.అప్పటి నుంచి మరో హీరోతో సినిమా కోసం ఎంత ట్రై చేసినా కుదరలే.
చిరంజీవి లేదా బాలకృష్ణతో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా ఎందుకో మెటీరియలైజ్ కాలేకపోయింది.ఇక పూరీ కెరీర్ ముగిసినట్లేనా అనుకునే సమయములో రెండు వార్తలు ఫిలిం సర్కిల్ లో చెక్కర్లు కొడుతున్నాయి….
అప్పట్లో దిమ్మతిరిగే హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ అండ్ రామ్ పోతినేని ( Ram potheneni )కాంబో ఇస్మార్ట్ శంకర్.ప్రస్తుతం వీరిద్దరి కాంబోను రిపీట్ కాబోతుందని తెలుస్తుంది.
అగైన్ సూపర్ డూపర్ హిట్టు కొట్టడం ఖాయమని తెలుస్తుంది.
అలాగే యంగ్ హీరోలలో మంచి దూకుడు మీద ఉన్న హీరో విశ్వక్ సేన్కకు పూరీ జగన్నాథ్ ఒక స్క్రిప్ట్‌ను వినిపించారట వెంటనే అతను ఓకే చెప్పారట.ఇక పూరి ఎలాగైనా లైగర్ తో వచ్చిన డిసాస్టర్ టాక్ ని పోగొట్టుకునిలా అటు రామ్ పోతినేనితో, ఇటు మాస క దాస్ విశ్వక్ షేన్ తో సినిమా తీసి హిట్ కొట్టాలని ఆలోచన్లో ఉన్నారటా.ఇక ఇప్పుడు ఇదే న్యూస్ అంతటా తెగ వైరల్ అవుతుంది.
ఇక ఇస్మార్ట్ శంకర్ ( iSmart Shankar ) సినిమాతో రామ్‌కు బ్లాక్ బస్టర్ హిట్టందించాడు.ఇక అదే తరహాలో పూరీ జగన్నాథ్, ఛార్మీ బ్యానర్ పూరీ కనెక్ట్స్ పై రామ్ హీరోగా సినిమా రాబోతుంది.
అయితే వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ ఇస్మార్ట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోందా.లేక కొత్త కథతో వస్తుందా? ఏ జోనర్‌లో ఉండబోతుంది అన్నది కాస్త సస్పెన్స్ గానే ఉంది.
మళ్లీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టించబోతుందోనని అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు మూవీ లవర్స్.మరి వైపు పూరీ జగన్నాథ్.విశ్వక్ సేన్ ల సినిమా ఆగస్ట్ నుంచి షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారని వార్త.ఇక వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.విశ్వక్ సేన్ ఎంతో ఎనర్జిటిక్ యాక్టర్ , అతనికి పూరీ స్టైల్ స్టోరీలు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయని అభిమానులు అంటున్నారు.ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్‌పై వర్క్ జరుగుతుందట.
ఇక ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చేలోపు విశ్వక్ సేన్ తన పెండింగ్ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసుకోబోతున్నాడు అని తెలుస్తుంది ఈ సినిమాలతో పూరి మళ్ళీ టచ్ లోకి వస్తాడు అనే చెప్పాలి…
.