మామూలుగా అమ్మాయిలు అందం కోసం ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు.ఎందుకంటే వాళ్ళు జీవితంలో అందం కూడా ఒక ముఖ్యమైన భాగం కాబట్టి.
ఇక హీరోయిన్స్, ఫిమేల్ ఆర్టిస్టుల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.నిత్యం అందం కోసమే పరితపిస్తూ ఉంటారు.
ఎప్పుడు అందంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు.ఎంత బిజీగా ఉన్నా అన్ని పనులు వదిలేసుకొని మరి పార్లర్ లకు వెళ్తూ ఉంటారు.
గంటలు తరబడి జిమ్ములో వర్కౌట్లు( Workouts in the gym ) చేస్తూ ఉంటారు.నిజానికి తాము అందంగా ఉండటానికి ఎన్ని కష్టాలైనా పడుతూ ఉంటారు.
అయితే శ్రీముఖి కూడా తన అందం కోసం బాగా కష్టపడుతుందని.ప్రత్యేకించి కొన్ని పనులు చేస్తుందని తెలిసింది.
ఆమె అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లితెర యాంకర్ శ్రీముఖి( Anchor Srimukhi ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం వరుస షో లతో ఓ రేంజ్ లో హడావుడి చేస్తుంది.ఏ ఛానల్ లో చూసిన కూడా ఈ అమ్మడు హవా నే నడుస్తుంది.
అదుర్స్ అనే ఎంటర్టైన్మెంట్ షో( Entertainment show ) తో తొలిసారిగా యాంకర్ గా పరిచయమైన శ్రీముఖి ఆ తర్వాత వరుసగా ఎన్నో షో లలో యాంకర్ గా చేసింది.ఒక్క ఛానల్ అని సరిపెట్టుకోకా అన్ని ఛానల్స్ లలో తన ఎనర్జీ చూపిస్తూ ఆల్రౌండర్ గా నిలిచింది.
వెండితెరపై కూడా నటిగా బాగానే గుర్తింపు తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ.
ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.తనకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా అందాలను బయట పెడుతూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.అలా బుల్లితెరలో, సోషల్ మీడియాలో బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే.అందరూ సెలబ్రిటీలాగా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు జిమ్ లో వర్కౌట్లు చేసినట్లు కనిపించలేదు.వర్కౌట్ చేయదు కాబట్టే ఆమె చూడ్డానికి లావుగా ఉంటుంది.అలా బొద్దుగా ఉన్నా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.ఇక ఈమె అందం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తుంది.ఇంతకు అదేంటంటే.
తను జిమ్ చేయకున్నా కూడా టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు యోగా చేస్తుందంట.వాకింగ్ మాత్రం కచ్చితంగా చేస్తుందని తెలిసింది.తిన్న వెంటనే ఒక 20 నిమిషాలు వాక్ చేస్తుందట.నీరు ఎక్కువగా తాగుతుందట.
రోజు తీసుకునే ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటుందట.ఎక్కువగా తింటుందట.
ఇక వారంలో ఒకరోజు ఫుల్ గా నాన్ వెజ్ ను తినేస్తుందట.ఇక అందంగా ఉండటానికి ఎటువంటి కేర్ తీసుకోదని.
ఇంగ్లీష్ ప్రొడక్ట్స్ వంటివి అస్సలు వాడదని తెలిసింది.కేవలం ఇంటి చిట్కాలను మాత్రమే వాడుతుందని తెలిసింది.