జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పదేపదే సీఎం పదవి తనకు ఆశ లేదని, పదవి వరిస్తే తీసుకుంటాను తప్ప, పదవి కోసమే పాకులాడనని, వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ తన లక్ష్యమని, అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారని చెబుతున్నారు.ప్రస్తుతం టిడిపి కష్టకాలంలో ఉంది.
ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు కావడంతో జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖాత్ అయిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) బయటకు వచ్చిన తర్వాత టిడిపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని ప్రకటించారు.ఇక జనసైనికులను టిడిపి తో కలిసి వెళ్లే విధంగా చేస్తున్నారు.
రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కొని అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చాక పదవి సంగతి చూద్దాం అంటూ పవన్ చెబుతున్నారు.తాజాగా హైదరాబాద్ నుంచి ఏపీలోని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళిన పవన్ టిడిపి తో పొత్తు అంశం పైన కీలక వ్యాఖ్యలు చేశారు.

టిడిపి అనుభవం, జనసేన పోరాట పటిమ ఈ రెండు రాష్ట్రానికి అవసరం అంటూ పవన్ చెప్పుకొచ్చారు.కేవలం ప్రజల కోసమే, రాష్ట్ర అభివృద్ధి కోసమే టిడిపితో జనసేన పార్టీ కలిసి పనిచేస్తుంది అని పవన్ అన్నారు .క్షేత్రస్థాయిలో టిడిపి , జనసేన( TDP Jana Sena ) కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు, సమన్వయం లోపం తలెత్తింది అని పదేపదే పవన్ రెండు పార్టీల మధ్య స్నేహబంధాన్ని గుర్తు చేస్తున్నారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవి విషయం పైన పవన్ మాట్లాడారు.నేను ఏనాడు ముఖ్యమంత్రి పదవి వద్దనుకోలేదు .ఎప్పుడు సముకంగానే ఉన్నాను. ఇప్పుడు ఆ పదవిని స్వీకరించేందుకు సిద్ధం కావడం కంటే, పదవి కంటే ప్రజల తరఫున నిలబడడం అనేది నాకు ఇష్టం అంటూ పవన్ చెప్పుకొచ్చారు.అయితే పవన్ సీఎం పదవిపై ఆశ లేదంటూనే సీఎం అయ్యే ఛాన్స్ తనుకుందని పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు.
దీని వెనుక కారణాలు చాలానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయ్యారు.

వీటితో పాటు అనేక కేసులు ఆయనపై ఉన్నాయి. దీంతో చంద్రబాబు( Chandrababu ) ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం లేదని బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ టిడిపి , జనసేన ఉమ్మడిగా ఏపీలో అధికారంలోకి వస్తే టిడిపికి ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి ఉండరని, కచ్చితంగా తానే ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకంతో పవన్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అందుకే పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన అన్ని స్థానాల్లోనూ గెలిస్తే కచ్చితంగా సీఎం పదవి విషయంలో టిడిపి ( TDP )పట్టుబట్టే అవకాశం ఉండదని నమ్ముతున్నారు.
అందుకే జనసైనికులను దానికి తగ్గట్లుగానే సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.







