రవితేజ నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ వచ్చినట్టేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రవితేజ.

( Ravi Teja ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా వైవిద్యభరితమైన ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

ఇక రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్( Mr.Bachchan ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక దాంతో పాటుగా అనుదీప్ డైరెక్షన్ లో దొంగ - పోలీస్ అనే మరొక సినిమా కూడా కమిట్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక దాంతో పాటుగా మరొక సినిమాని కూడా రవితేజ కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.అది ఎవరితో అంటే ఇంతకుముందు రవితేజ తో పవర్ సినిమా చేసి డైరెక్టర్ గా పరిచయమైన బాబితో ( Director Bobby ) రవితేజ నెక్స్ట్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం బాబీ బాలయ్య తో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత రవితేజ తో చేసే సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ లైనప్ ను కనక చూసుకున్నట్లయితే రవితేజ ప్రస్తుతం ఎవరికి తగ్గకుండా భారీ ప్రాజెక్టులను సెట్ చేస్తున్నాడు.

Advertisement

ఇక ఈ సినిమాలతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక దాంతో పాటుగా మరికొన్ని సినిమాలకు కూడా రవితేజ కమిట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక రవితేజ దాదాపు సంవత్సరానికి రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇప్పటికే ఈగల్ సినిమాని రిలీజ్ చేశాడు.ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేసి ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు