ఈసారి తెలంగాణ ఎన్నికల నుంచి టీడీపీ( TDP ) తప్పుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆ పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినప్పటికి పరోక్షంగా ఇతర పార్టీలకు పొత్తు ప్రకటించే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ టీడీపీ మద్య అంతర్గత ఒప్పందం జరిగిందని కాంగ్రెస్( Congress ) కోసమే ఆ పార్టీ ఎన్నికల రేస్ నుంచి తప్పుకుందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి.అయితే ఈ తరహా వార్తలపై తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు.
కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం టీడీపీతో ఉన్న దోస్తీని పరోక్షంగా బయట పెడుతున్నారు.

ఆ మద్య ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao ) మాట్లాడుతూ తాను గెలవడం వల్ల ఏపీ టీడీపీకి మేలు జరుగుతుందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు.ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంటే.తాజాగా ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) వ్యవహార శైలి కూడా కాంగ్రెస్ టీడీపీ మద్య ఉన్న అంతర్గత బంధాన్ని బయట పెడుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రు పాలెం మండలంలో పర్యటించిన ఆయన అక్కడి టీడీపీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ కండువా ను మెడలో వేసుకొని అందరినీ ఆశ్చర్య పరిచారు.

దీంతో అసలు టీడీపీ కాంగ్రెస్ పార్టీల మద్య ఏం జరుగుతుందనే చర్చ హాట్ టాపిక్ అయింది.2018 ఎన్నికల ముందు కూడా టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆ తరువాత ఇరు పార్టీలు దూరమైనప్పటికి మళ్ళీ ఈ ఎన్నికల సమయానికి దగ్గరైనట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
పైగా ఈసారి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్ కు టీడీపీ వత్తాసు పలకడం గ్యారెంటీ అనే వాదన కూడా బలపడుతోంది.మరి కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ప్రత్యేక్షంగా మద్దతు తెలిపే అవకాశం ఉందా ? లేదా పరోక్షంగానే దోస్తీని కొనసాగిస్తుందా అనేది చూడాలి.