ప్రస్తుతం అనుష్క శెట్టి ( Anushka ) నవీన్ పోలిశెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమాతో మళ్ళీ అనుష్కకి కం బ్యాక్ వచ్చినట్లు అయింది అని అందరూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాలో లేడీ విలన్ గా ఈ హీరోయిన్ నటించబోతుందని,అలాగే చిరంజీవి ( Chiranjeevi ) నెక్స్ట్ సినిమాలో కూడా అనుష్కకి అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయాలన్నీ పక్కన పెడితే అనుష్క ప్రస్తుతం ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిందంటే దానికి ప్రధాన కారణం ఆ స్టార్ విలనే అని, ఆ విలన్ దయవల్లే ఈరోజు అనుష్క సౌత్ లో ఇంత మంచి హోదాలో కొనసాగుతుంది అంటూ నెట్టింట్లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఇంతకీ స్టార్ హీరోయిన్ అనుష్కకి లైఫ్ ఇచ్చిన ఆ విలన్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన నాగార్జున హీరోగా చేసిన సూపర్ సినిమాలో అయేషా టాకియా ( Ayesha takia ) ఫస్ట్ హీరోయిన్ గా చేస్తే సెకండ్ హీరోయిన్ గా అనుష్క శెట్టి చేసింది.
అయితే ఈసినిమా ద్వారా అనుష్క ఇండస్ట్రీకి పరిచయం అవడంతో చాలామంది అనుష్కకి లైఫ్ ఇచ్చింది డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని అనుకుంటారు.కానీ అనుష్కకి లైఫ్ ఇచ్చింది పూరి జగన్నాథ్ కాదట.
స్టార్ విలన్ గా సినిమాల్లో కొనసాగుతున్నప్పటికీ ఎంతో గొప్ప మానవత్వం ఉన్న మనిషిగా కరోనా సమయం నుండి ఇప్పటివరకు తనకు ఉన్నంతలో పేదలకు సహాయం చేస్తున్న సోను సూద్( Sonu sood ).అవును సోనుసూద్ వల్లే అనుష్క ప్రస్తుతం ఈ రేంజ్ లో ఉందట.ఇక అసలు విషయం ఏమిటంటే.ఈ సినిమాలో నాగార్జున, అనుష్క, అయేషా టాకీయా, సోనూసూద్ ముఖ్యపాత్రల్లో చేశారు.
అయితే ఇందులో సెకండ్ హీరోయిన్ గా కొత్త హీరోయిన్ ని తీసుకుందామని పూరిజగన్నాథ్ ( Puri jagannad ) అనుకున్నారట.అంతేకాదు ఈ విషయం సోనూ సూద్ కి చెప్పి నీకు తెలిసిన ఎవరైనా అమ్మాయి ఉంటే నాకు చెప్పు అని అన్నారట.దాంతో సోనూ సూద్ కి రోజు జిమ్ కి వచ్చే ఒక అమ్మాయి గుర్తుకు వచ్చిందట.ఇక ఈ సినిమాలో ఆ అమ్మాయి బాగుంటుంది అని అనుకున్నారట.
అలా ఓ రోజు జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్లి నెంబర్ తీసుకొని పూరి జగన్నాథ్ తీస్తే ఆయన ఫోన్ చేసి సినిమాలో అవకాశం ఉంది.ఇక్కడికి వస్తే స్క్రీన్ టెస్ట్ చేసి నిన్ను తీసుకుంటాను అని అన్నారట.
అలా ఆరోజు అనుష్క (Anushka) ని పూరి జగన్నాథ్ కి చెప్పడంతో ఆ సినిమాలో నటించి ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్లలో ఒకరిగా అనుష్క కొనసాగుతుంది.అయితే అనుష్క సోనూ సూద్ వల్లే ఇండస్ట్రీకి పరిచయమైంది అనే సంగతి చాలా మందికి తెలియదు.