భారత దేశంలో ఎరువుల కొరత తీవ్రమవడంతో మూసివేసిన రామగుండం,తాల్చేర్, సింద్రీ, గోరఖ్ పూర్ ఎరువుల కార్మాగారాల పునరుద్ధరణ అవశ్యకత పెరిగింది.
అందులో రామగుండం పెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ను నిర్మించడానికి 2015 పిబ్రవరి 17 న ప్రణాళికను ప్రకటించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2016 ఆగస్ట్ 7న మెదక్ జిల్లా గజ్వేల్ దగ్గర సాంకేతిక విజ్ఞానంతో ఆర్.ఎఫ్.సి.ఎల్ కు పునాది రాయి వేశాడు.రూ.6,175.51 కోట్ల వ్యయంతో జాయింట్ వెంచర్స్ ప్రాతిపదికన నిర్ణించడానికి నిర్ణయమైంది.నేషనల్ పెర్టిలైజర్స్ లిమిటెడ్ 26శాతం, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ 26 శాతం, పెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 11శాతం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం,గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా 14.3శాతం, హల్దోర్ టాప్స్ కన్సార్టియం 11.7 శాతం మరియు 5,000 కోట్ల అప్పు ద్వారా నిధులను సమకూర్చి నిష్పత్తి 70::30 భాగస్వామ్యముగా 2018 ఆగస్ట్ 18న "షేర్ సబ్ స్క్రిప్సన్ కం షేర్ ఓల్దర్స్ అగ్రిమెంట్ జరిగింది.ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటి సరఫరా, తెలంగాణ జెన్ కో నుండి విద్యుత్ సరఫరా ,స్టేట్ పెట్రో నెట్ లిమిటెడ్ అనుసంధానంతో కాకినాడ నుండి 365 కిలో మీటర్ల పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసుకుని 2,200 ఎంటిపిడి అమోనియా,మరియు 3,850 ఎంటిపిడి యూరియా ఉత్పత్తి చేసి వ్యవసాయ పంటల అధిక దిగుబడికి తోడ్పడే లక్ష్యాన్ని ప్రకటించారు.
గతంలో బంద్ పెట్టిన ఆర్.ఎఫ్.సి.ఐ ఎల్ ఇప్పుడు పునరుద్ధరణతో ఉత్పత్తికి సిద్ధమవుతున్న ఆర్ఎఫ్సిఎల్ నిర్మాణంలో వీర్లపల్లి, లక్ష్మీపురం,ఎల్కలపల్లి ,అడ్డగుంట గ్రామాల ప్రజలు నిర్వాసితులైనారు.కాలుష్యానికి గురైనారు.విధి నిర్వహణలో జరిగిన ప్రమాదాల్లో చనిపోయారు.1990 సెప్టెంబర్ 9 న మిథనాల్ లీకేజీ తో మంటలు లేచి 13 మంది కార్మికులు చనిపోయారు.అప్పుడు ఎరువుల కార్మాగారాన్ని అర్ధాంతరంగా మూసీ వేసినందున ఉద్యోగాలను,ఉపాధిని కోల్పోయారు.
ఇప్పుడు ఆర్ఎఫ్సిఎల్ పునరుద్ధరణ పనులు పూర్తిచేసి 2021 పిబ్రవరి 20న యూరియా ఉత్పత్తి ప్రారంభం అయింది.యూరియా,అమ్మోనియాను నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కిసాన్ బ్రాండ్ తో జూన్ 21న ఇంచార్జ్ జి.ఎం విజయ్ కుమార్ బంగార్ రైలు మార్గం ద్వారా మార్కెట్ కు తరలించడం ప్రారంభించాడు.తెలంగాణకు 43,120 టన్నులు,ఆంధ్రప్రదేశ్ కు 14,631,మహారాష్ట్రకు 11,205,కర్ణాటకకు 23,477, సత్తీస్ గడ్ కు 11,513 తన్నులను సరఫరా చేశారు.2021 - 2022 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.759.76 కోట్లు నష్టాన్ని చవిచూసింది.కాని 2022 -2023 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో అనుహ్యంగా రూ.67 కోట్ల లాభాలను ఆర్జించింది.
అయితే 2015 మార్చి 11 న జరిగిన పబ్లిక్ హియరింగ్ప్రజాభిప్రాయ సేకరణలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి,ఆర్ఎఫ్సిఎల్ ముఖ్య కార్యనిర్వణాధికారి ప్రభావితులకు ఇచ్చిన భరోసాను బుట్టదాఖలు చేశారు.రాష్ట్రపతి ఉత్తర్వులు డిపార్ట్ మెంటు ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ మార్గదర్శకాలకు విరుద్ధంగా కిందిస్థాయి ఉద్యోగ నియామకాలను తుంగలో తొక్కారు.ప్రక్కనే ఉన్న ఎన్.టి.పి.సిలో ఐ.టి.ఐ విద్యార్హత గల కింది స్థాయి ఉద్యోగాలను స్థానిక ఎంప్లాయిమెంటు ఎక్సేంజ్ ల ద్వారా జాబితా ప్రతిపాదికన నియామకం చేసుకున్నారు.జాతీయ స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియకు పూనుకొని నిర్వాసితులకు,స్థానికులకు అన్యాయం చేశారు.
ఇండస్ట్రీల్ ఇంజనీరింగ్ విభాగం అధ్యయనంలో యూరియా, అమోనియా ఉత్పత్తి, రవాణా ,యితరాత్ర పనులను కలిపి 16 పని స్థలాల విభాగాలను గుర్తించారు.అందుకు 600 మంది పర్మనెంట్ ఉద్యోగులు పోను ,1000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధి నిర్వహణ చేయవలసి ఉంటుందని అంచనా వేశారు.
కనీసం కాంట్రాక్ట్ కార్మికులనైన పూర్తి స్థాయిలో స్థానికులను నియమించుకోలేదు.ఆ కాంట్రాక్ట్ కార్మికుల నియామకాలకు కూడా ఒకొకరి దగ్గర పర్మనెంటు అయితరని మోసం చేసి మధ్య దళారులు,కింది స్థాయి రాజకీయ నాయకులు అయిదు లక్షల రూపాయల చొప్పున 50కోట్ల రూపాయలు వసూలు చేశారు.
మోసపోయామని గ్రహించిన కాంట్రాక్ట్ కార్మికులు పైరవీ డబ్బులను అడిగిన,పిర్యాదు చేసిన న్యాయం జరుగనందున ముంజు హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఇంకా ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి కొన ఊపిరితో బయటపడినారు.
సింగరేణి కంపెనీకి దాదాపు 2014 నుండి బడ్జెట్ సపోర్ట్ ను ఉపసంహరించుకున్నప్పటికి స్వయం కృషితో ప్రగతిని సాదించుతుంది.అంతేకాకుండా వివిధ పన్నులరూపేణా కేంద్ర ప్రభుత్వముకు రూ.14,362"48 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వంకు రూ.13,10522 కోట్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పరిసర ప్రాంతాల అభివృద్ధి గురించి రూ.2,262.85 కోట్లు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేర రూ.44.931 కోట్లు, కొత్తగూడెం రైల్వే లైన్ కు రూ.700 కోట్లు, అటవీ భూముల పరిహారానికి రూ.450 కోట్లు చెల్లించడం జరిగింది.కోయగూడెం, సత్తుపల్లి,కళ్యాణ్ ఖని, శ్రావణ్ పల్లి బొగ్గు గనులకు రూ.66 కోట్లు వెచ్చించి భూగర్భ పరిశోధనలు పూర్తి చేసి, బొగ్గు తవ్వకాలకై అనుమతిని కోరిన మైన్స్ ను వేలం పాటలో ,ఓపెన్ బిడ్డింగ్ లో కేటాయించే ప్రక్రియకు పాల్పడటం జరిగింది.కోల్ మైన్స్ స్పెషల్ప్రొవిజన్ అక్ట్ 2015 పేర,కమ్మర్షియల్ మైనింగ్ పేర, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి పేర దేశీయ, ప్రభుత్వ రంగ బొగ్గు కంపెనీలైన కోల్ ఇండియా, సింగరేణిలకు ముప్పు తెచ్చే సంస్కరణలను వేగిరం చేసింది.
ప్రజాస్వామ్యంలో అసంతృప్తి రాజకీయ ప్రక్రియసేఫ్టీ వాల్వుగా ఉపయోగపడుతుంది.అధికార పక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసే విధంగా, ప్రజల భాగస్వామ్యంతో బహిరంగంగా నిరసన రూపకంగా నివేదించడం ప్రజాస్వామికమైన మార్గదర్శకం అవుతుంది.2022 నవంబర్ 12 న రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ జాతీకి అంకితం చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకుంటామని సి.పి.ఐ,సి.పి.ఎం, టి.బి.జి.కె.ఎస్ లు ప్రకటించాయి.ప్రజాస్వామ్య బద్ధమైన నిరసన కార్యక్రమాన్నీ ప్రజాస్వామిక పద్ధతిలో ఆదరించి కేంద్ర ప్రభుత్వంగా ప్రభుత్వ పరిశ్రమలను, పర్యావరణాన్ని పరిరక్షించి ఉపాధి ,ఉద్యోగ అవకాశాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy