అమెరికాలో ఇళ్ల ధరలు భారీ షాకులు ఇస్తున్నాయి.ఇక్కడ పూరీ గుడిసెల్లాంటి ఇళ్లు కూడా కోట్లలో ధరలు పలుకుతున్నాయి.
ఇటీవల ఓ ధ్వంసమైన ఇల్లును కూడా కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశారు.కాలిఫోర్నియా రాష్ట్రం, లాస్ ఏంజిల్స్ సిటీలోని( City of Los Angeles, California ) ఉత్తర తూర్పు భాగంలో ఉందీ ఇల్లు.
ఇది చాలా చిన్నదే.పైగా ఈ ఇల్లు పూర్తిగా లేదు.
అంటే, ఇంటిలో సగం భాగం మాత్రమే ఉంది.ఈ ఇంటిలో ఒక బెడ్‌రూమ్, ఒక బాత్రూమ్ మాత్రమే ఉన్నాయి.అయితే ఆ ఇంటి ధర అక్షరాలా రూ.4.19 కోట్లు చెప్పి భారీ షాకిచ్చారు.ఇదే ధరకు ఇండియాలో అత్యంత విలాసవంతమైన ఇల్లు కట్టుకోవచ్చు.
కానీ అది అమెరికా కావడంతో అక్కడ పనికి రాని హౌసెస్ కూడా బాగా .
మే నెలలో, ఈ ఇంటిపై ఒక పైన్ చెట్టు పడింది.ఆ సమయంలో ఇంట్లో ఇద్దరు అద్దెదారులు, వారి కుక్కలు ఉన్నారు.అయితే, ఎవరికీ ఏమీ జరగలేదు.కానీ ఇల్లు చాలా దెబ్బతింది.ఇంటి పైకప్పు వంగిపోయింది.
గోడ కూడా పగిలిపోయింది.ఈ ఇంటిని అమ్ముతున్న ఏజెంట్ కెవిన్ వీలర్ ( Agent Kevin Wheeler )చాలా ఫన్నీగా ఒక విషయం చెప్పారు.
ఆయన, “ఇప్పుడు ఈ ఇంటికి ‘ఓపెన్-కాన్సెప్ట్ ఫ్లోర్ ప్లాన్’ అని పేరు పెట్టొచ్చు” అని నవ్వుతూ అన్నారు.అంటే, ఇంటిలో గోడలు తక్కువగా ఉండి, అన్ని గదులు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటుందని అర్థం.
ఈ ఇంటి పరిమాణం కేవలం 645 చదరపు అడుగులు మాత్రమే.ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు కానీ, నీరు, మురుగు నీరు పోయే వ్యవస్థ మాత్రం పని చేస్తుంది.
చెట్టు పడినప్పుడు అద్దెదారులు తప్పించుకున్న వెనుక తలుపు ఇప్పటికీ ఉంది.ఈ ఇంటిని అమ్ముతున్న ఏజెంట్ USA టుడే పత్రికతో( USA Today magazine ) “ఇది సగం ఇల్లు, కానీ ధర మాత్రం 5 లక్షల డాలర్లు.అంటే, సగం ఇంటికి సగం మిలియన్ డాలర్లు” అని అన్నారు.ఈ ధర అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.మోన్‌రోవియా ప్రదేశంలో, 50 ఏళ్లకు పైబడిన భవనాలను కూల్చే ముందు ఒకసారి పరిశీలించాలనే నియమం ఉంది.రెడ్‌ఫిన్ సంస్థ ప్రకారం, ఈ ఇల్లు 1920ల ప్రారంభంలో కట్టబడింది.
కానీ, ఈ ఇల్లు ఒక ప్రకృతి వైపరీత్యం వల్ల దెబ్బతిన్నందున, దీన్ని కూల్చే ముందు పరిశీలించాల్సిన అవసరం లేదని వీలర్ చెప్పారు.
అంటే, ఈ ఇంటిని మరమ్మతు చేసి లేదా కొత్తగా కట్టాలంటే సాధారణంగా చేసే కొన్ని ప్రక్రియలు ఇప్పుడు అవసరం లేదు.ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారు చాలా మంది ఉన్నారు కానీ, ఇళ్లు తక్కువగా ఉన్నాయి.ముఖ్యంగా ఇంత తక్కువ ధరకు ఇల్లు దొరకడం చాలా అరుదు కాబట్టి, ఈ ఇంటిపై అందరి దృష్టి పడిందివీలర్ లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికకు( Los Angeles Times ) ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ ఇంటిని కొనాలని చాలా మంది ముందుకు వచ్చారని చెప్పారు.ఆ ఘటన జరిగిన వెంటనే కొంతమంది రూ.2.51 కోట్లు నుంచి రూ.2.9 కోట్ల వరకు ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలిపారు.కానీ ఇప్పుడు అమ్ముతున్న ధర కంటే ఇది చాలా తక్కువ.