కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ఎన్నో అవంతరాలు దాటుకుని తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మాత్రం ఆగడం లేదు.ఇప్పటికే చాలామంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వాళ్ళు కొట్టుకోవడం ఖాయం తన్నుకోవడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్లో ఉన్న వాళ్లకి బుద్ధి రావడం లేదు అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.
ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారిలో వారికే ఐక్యత ఉండదు ఇంకా ప్రజలను ఏం పాలిస్తారు అనే వాదన ఉంది.ఇలాంటి సమయంలో సీఎం ఎవరు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
![Telugu Congress, Congress Cm, Delhi, Dk Shiva Kumar, Komativenkat, Revanth Reddy Telugu Congress, Congress Cm, Delhi, Dk Shiva Kumar, Komativenkat, Revanth Reddy](https://telugustop.com/wp-content/uploads/2023/12/CM-Mallikarjun-Kharge-Uttam-kumar-reddy-revanth-reddy-ts-politics-brs.jpg)
అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి ని సీఎం అని అందరూ భావించినప్పటికీ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి అస్సలు ఇష్టపడడం లేదట.కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించి ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించారు.కాబట్టి సీఎం గా రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది అని అనుకున్నారట.కానీ ముందు నుండి ఉన్న సీనియర్ నాయకులు అయినా ఉత్తంకుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క( Batti vikramarka ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నాయకులు నాకంటే నాకు సీఎం పదవి రావాలి అని భావిస్తున్నారట.
![Telugu Congress, Congress Cm, Delhi, Dk Shiva Kumar, Komativenkat, Revanth Reddy Telugu Congress, Congress Cm, Delhi, Dk Shiva Kumar, Komativenkat, Revanth Reddy](https://telugustop.com/wp-content/uploads/2023/12/Mallikarjun-Kharge-Uttam-kumar-reddy-revanth-reddy-politics-brs-rahul-gandhi.jpg)
అయితే ఇప్పటికే సీఎం విషయంలో మల్లికార్జున కార్గే( Mallikarjun Kharge ) ,డీకే శివకుమార్ లను నియమించినప్పటికీ వీళ్లు కూడా ఈ విషయంలో ఎటు తేల్చలేక ఢిల్లీ అధిష్టానానికే తెలంగాణ సీఎం విషయాన్ని వదిలేశారట.అయితే తాజాగా ఢిల్లీకి బట్టి విక్రమార్క,అలాగే ఉత్తంకుమార్ రెడ్డి ఇద్దరు చేరారు.వీరిద్దరూ ఢిల్లీలోని పెద్దలతో సమావేశమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.ఉత్తంకుమార్ రెడ్డి ( Uttam kumar reddy ) భట్టి విక్రమార్కను ఢిల్లీకి పిలిపించుకుంది కేవలం వారిని బుజ్జగించడానికి మాత్రమేనని, అంతేగాని సీఎం కుర్చీలో వారిని కూర్చోబెట్టడానికి కాదని తెలుస్తోంది.వీరిద్దరిని ఢిల్లీలోని అధిష్టానం పెద్దలు భుజ్జగించి వారికి సముచిత స్థానాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని సీఎం చేయడం వెనుక ఉన్న కారణాలను కూడా ఇద్దరికీ వివరించి చెప్పడానికే ఢిల్లీకి పిలిపించుకున్నట్లు సమాచారం.
ఇక ఇదే గనక నిజమైతే రేవంత్ రెడ్డి ( Revanth reddy ) కి ముఖ్యమంత్రి అయ్యే లైన్ క్లియర్ అయినట్టే అని తెలుస్తోంది.ఇక సాయంత్రానికి ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై స్పష్టత వస్తుంది అని తెలుస్తుంది
.