ప్రస్తుతం దేశ రాజకీయాలను పరిశీలిస్తే ప్రధాని మోదీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విధానాల పరంగా చెరో దారిలో ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తోంది.కనీసం ఒకరికొకరు ఎదురుపడటానికి కూడా మోదీ, కేసీఆర్ ఇష్టపడటం లేదు.
ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికేందుకు కూడా నిరాకరిస్తున్నారు.అటు మోదీ కూడా కేసీఆర్‌ను కలిసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
అయితే మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వారి ప్రభుత్వాలపై ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.ముఖ్యంగా అవినీతి విషయంలో మోదీ సర్కారుపై కేసీఆర్ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు.
నిజం చెప్పాలంటే ఇప్పటివరకు మోదీ సర్కారుపై పెద్ద స్కాం మరకలేవీ పడలేదు.అయినా టీఆర్ఎస్ పార్టీ అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉంది.
అటు బీజేపీ కూడా తానేం తక్కువ తినలేదన్న రీతిలో టీఆర్ఎస్ సర్కారుపై అవీనితి ఆరోపణలు చేస్తూ కేసీఆర్‌ను జైలుకు పంపుతామని హెచ్చరికలు పంపుతోంది.
ఇదిలా ఉంటే… మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగల చందాన వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.

ఇద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తోంది.నిజంగా మోదీకి కేసీఆర్ తన దమ్ము చూపించాలని డిసైడ్ అయితే.ఆయనతో పాటు వేదిక పంచుకుని కేంద్ర ప్రభుత్వం కారణంగా తెలంగాణ ఎంత నష్టపోతుందన్న విషయాన్ని ఎందుకు చెప్పరని కాంగ్రెసక ప్రశ్నిస్తోంది.

అటు కేసీఆర్‌పై ప్రధాని మోదీ స్వయంగా అవినీతి వ్యాఖ్యలు చేశారని.అయితే మాటలకు పరిమితం కాకుండా సీఎం కేసీఆర్ అవినీతిని వెలికి తీసి ప్రధాని మోదీ తన చిత్తశుద్ధి చాటుకోవాలని కాంగ్రెస్ నేత పొన్నాల డిమాండ్ చేశారు.అన్ని దర్యాప్తు సంస్థలు తన గుప్పెట్లో ఉంచుకుని, దర్యాప్తుకు ఆదేశించే అధికారం ఉండి కూడా మోదీ కేవలం విమర్శలతో సరిపెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
నిజంగానే అవినీతి ఆరోపణలు ఉంటే వాటిని బయటపెట్టాలని.ఉత్త మాటలు చెప్పడం కాదని కాంగ్రెస్ హితవు పలుకుతోంది.