'భట్టి'కి అంత ప్రాధాన్యం అందుకేనా ? 

తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM revanth reddy )వ్యూహాత్మకంగానే రాజకీయ అడుగులు వేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి అందరిని కలుపుకుని వెళ్లే విధంగా వ్యవహరిస్తున్నారు.

అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.ప్రతి విషయంలోనూ పార్టీలోని సీనియర్ నాయకులతో సంప్రదింపులు చేస్తూ, అందరి ఆమోదాన్ని తీసుకునే తన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు.

ఈ విధంగా పార్టీలో తనుకు శత్రువులు ఎవరు తయారు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రతి నిర్ణయంలోనూ భట్టి విక్రమార్కను భాగస్వామ్యం చేస్తున్నారు.అలాగే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో ఏవైనా సంప్రదింపులు చేయాల్సి ఉన్నా.

Advertisement
Is That Why 'Bhatti' Is So Important , Bhatti Vikaramarka, Telangana Election

కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా.భట్టి విక్రమార్కను వెంటబెట్టుకుని వెళ్తున్నారు.

ఆయనతో అన్ని విషయాల పైన చర్చిస్తున్నారు.

Is That Why bhatti Is So Important , Bhatti Vikaramarka, Telangana Election

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి నివాసం ఉండేందుకు అవకాశం ఉన్నా దానిని భట్టి విక్రమార్కకే వదిలిపెట్టారు.అలాగే కీలకమైన ఆర్థిక శాఖను కూడా ఆయనకు అప్పగించారు.నామినేటెడ్ పదవులలోనూ భట్టి విక్రమార్కతో చర్చించి, పార్టీ పెద్దలతో చర్చలు జరపాలని రేవంత్ నిర్ణయించుకున్నారు.

అనూహ్యంగా భట్టి విక్రమార్కకు ప్రాధాన్యం పెంచడం వెనుక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.తన నిర్ణయాలు, పథకాల అమలు విషయంలో ఏవైనా లోటుపాట్లు వచ్చినా, విమర్శలు వచ్చినా అది తన ఒక్కడిపైనే విమర్శలు చేసేందుకు అవకాశం ఉండదని, తాను భట్టి విక్రమార్క( Bhatti vikaramarka ) కలిసి తీసుకున్న నిర్ణయాలు కనుక, సీనియర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తారని రేవంత్ అభిప్రాయపడుతున్నట్లుగా ఆయన వ్యవహారం చూస్తే అర్థమవుతుంది.

Is That Why bhatti Is So Important , Bhatti Vikaramarka, Telangana Election
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఏదైనా తేడా వస్తే తనకు భట్టి నుంచే ఎక్కువ ముప్పు ఉంటుందని రేవంత్ గ్రహించారు.అందుకే ప్రతి విషయంలో ఆయనకు ఆ స్థాయిలో ప్రాధాన్యం కల్పిస్తున్నట్టుగా అర్థమవుతుంది.అలాగే ప్రభుత్వ పరంగా తన సహచర మంత్రులకు అన్ని విషయాల్లోనూ రేవంత్ భాగస్వామ్యం కల్పిస్తున్నారు.

Advertisement

శాఖల వారిగా సమీక్షలోనూ, వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా మంత్రులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.అలాగే ఎమ్మెల్యేలకు అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తూ అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇస్తున్నారు.మొత్తంగా అందరికీ అనుకూలమైన వ్యక్తిగా రేవంత్ ముద్ర వేయించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచింది.మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలు మాత్రమే కావడంతో రేవంత్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు