ఏపీలో ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యేల నివాసాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.
అయితే తమ సమస్యలను పరిష్కరించి డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు.ప్రభుత్వం స్పందించి తమ డిమండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో ఆందోళలను ఉధృతం చేస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.







