రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమా ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా ఆస్కార్ అవార్డు అందుకుంది.
ఇలా ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ వేడుకలలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు.
రాజమౌళి కార్తికేయ రామ్ చరణ్ వీరంతా కూడా తమ భార్యలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్( NTR ) వైఫ్ లక్ష్మి ప్రణతి( Lakshmi Pranathi ) కూడా ఆస్కార్ వేడుకలకు వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు అయితే ఈమె మాత్రం ఈ అవార్డు వేడుకలకు హాజరు కాకపోవడంతో అసలు ప్రణతి ఆస్కార్ వేడుకలకు రాకపోవడానికి కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు.నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సమయంలో ఉపాసనతో పాటు ప్రణతి కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.కానీ ఆస్కార్ కి మాత్రం ఉపాసన హాజరైనప్పటికీ ప్రణతి మాత్రం హాజరు కాలేకపోయారు.
అయితే లక్ష్మీ ప్రణతి హాజరు కాకపోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తోంది.

లక్ష్మీ ప్రణతి కూడా ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో ఈమె తన టికెట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది.ఆస్కార్ వేడుకల నిమిత్తం అమెరికా వెళ్లాల్సిన సమయంలో తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ కూడా ఆలస్యంగా వెళ్లారు.అయితే లక్ష్మీ ప్రణతి కూడా వెళ్లాల్సి ఉండగా ఆమె హెల్త్ ఇష్యూ కారణంగా చివరి నిమిషంలో అమెరికా పర్యటన క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా హెల్త్ ఇష్యూ కారణంగానే ప్రణతి ఆస్కార్ వేడుకలలో పాల్గొనలేదని అంతకుమించి మరే కారణం లేదని సమాచారం.







