ఆ హీరోయిన్ తో అల్లరి నరేష్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా..?

ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ( EVV Satyanarayana ) తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్( Allari Naresh ) తన మొదటి సినిమా నుండే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసాడు.ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీ లో కామెడీ హీరో గా ఏ రేంజ్ సెన్సేషన్ ని సృష్టించాడో, ఈ జనరేషన్ లో అల్లరి నరేష్ కూడా కామెడీ హీరోగా అదే రేంజ్ సెన్సేషన్ ని సృష్టించాడు.

 Is That The Reason Why Allari Naresh's Wedding With That Heroine Was Cancelled ,-TeluguStop.com

తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేసి తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.అయితే ఎప్పుడు కామెడీ సినిమాలే చేస్తే చూసే జనాలకు బోర్ కొడుతుంది.

అందుకే అప్పుడప్పుడు గమ్యం లాంటి గుర్తుండిపోయే పాత్రలు కూడా చేసాడు.ఇప్పుడు అయితే ఆయన కామెడీ జానర్ ని పూర్తిగా పక్కన పెట్టి నటనకి ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

కంటెంట్ సినిమాలతోనే హిట్స్ అందుకుంటున్నాడు.

Telugu Allari Naresh, Farzana-Movie

ఇదంతా పక్కన పెడితే అల్లరి నరేష్ కి పెళ్లి జరిగి, ఒక పాప కూడా పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే.అప్పట్లో నరేష్ సినిమాలోని హీరోయిన్లు చాలా బాగుండేవారు.చేసిన హీరోయిన్ తో మరోసారి సినిమా చేసే అలవాటు లేని అల్లరి నరేష్, ఫర్జానా( Farzana ) అనే హీరోయిన్ తో ఏకంగా మూడు నుండి నాలుగు సినిమాలు చేసాడు.

సినీ ఇండస్ట్రీ లో ఇలా రిపీట్ గా హీరో హీరోయిన్ కాంబినేషన్స్ తెరకెక్కితే వాళ్ళ మధ్య ప్రేమ ఉందని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా ఎన్నో రకాల వార్తలు పుట్టిస్తుంది మీడియా.అలా అల్లరి నరేష్ మరియు ఫర్జానా మధ్య కూడా అలాంటి పుకార్లు చాలానే పుట్టించారు.

కొన్ని వెబ్ సైట్స్ అయితే వీళ్లిద్దరు పెళ్లి చేసేసుకున్నారు అని కూడా చెప్పారు.ఈ వార్తలు ఈవీవీ సత్యనారాయణ చూసి ఎవరు రా నాకోడలు, ఇంటికి తీసుకొని రా అని సరదాగా అనేవాడట.

Telugu Allari Naresh, Farzana-Movie

అంతే కాదు వీళ్ళ మధ్య లవ్ బ్రేకప్ అయ్యింది అని కూడా అప్పట్లో రూమర్స్ వినిపించేవి.దీనిపై అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు.సాధారణంగా ఎవరైనా హీరోయిన్ షూటింగ్ కి వచ్చేటప్పుడు తన తల్లితండ్రులను లొకేషన్ కి తోడుగా తెచ్చుకుంటారు.కానీ ఫర్జానా తన బాయ్ ఫ్రెండ్ ని తోడుగా తెచ్చుకునేది.

అలాంటి కమిటెడ్ అమ్మాయితో నాకు ప్రేమాయణం ఉన్నట్టుగా రాసారు అంటూ అల్లరి నరేష్ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube