మూడోసారి అధికారంలోకి వస్తామని, హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్(kcr) కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పెద్ద షాక్ కలిగించాయి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గజ్వేల్ నుంచి విజయం సాధించినా, కామారెడ్డి నుంచి మాత్రం ఓటమి చెందారు.
బీఆర్ఎస్ కు (BRS)చెందిన కీలక నేతలు ఎంతోమంది ఓటమిని చవి చూశారు.ఈ స్థాయిలో బీ ఆర్ ఎస్ ఓటమి చెందుతుంది అని ఎవరు ఊహించలేదు.
ఘోర పరాజయం ఎదురైన తర్వాత బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణాలు ఏమిటి అనేది చర్చనీయాంశం గా మారింది .చాలా చోట్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు , కొంతమంది మంత్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా, బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడం, అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను పేర్లను ప్రకటించి 119 స్థానాలు మెజారిటీ సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పగానే చెప్పుకుంది .అయితే సిట్టింగ్ లపై ప్రజలు వ్యతిరేకత ఉండడం తో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

కొన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్ లను మార్చారు.అక్కడ ఆ అభ్యర్థులే గెలిచారు.మొత్తం 12 స్థానాల్లో సిట్టింగ్ లను కాదని కొత్తవారికి అవకాశం ఇచ్చారు.
అందులో 9స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది .మూడు స్థానాలు కామారెడ్డి, ఖానాపూర్ , ఆసిఫాబాద్ బోథ్, అలంపూర్ , జనగాం, స్టేషన్ ఘన్ పూర్, నర్సాపూర్, వేములవాడ , ఉప్పల్, కోరుట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని ఇతరులకు అవకాశం ఇచ్చారు.మల్కాజి గిరిలో లో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇచ్చినా, ఆయన కాంగ్రెస్ లో చేరడంతో ఆస్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డిని నిలబెట్టారు.ఆస్థానంలో విజయం సాధించింది.
బీఆర్ఎస్ కామారెడ్డి, వేములవాడ, ఖానాపూర్ లలో సిట్టింగ్ లను తప్పించారు.కామారెడ్డి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్థానంలో స్వయంగా కేసీఆర్ పోటీ చేసి ఓటమి చెందారు .ఖానాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు బిఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదు.

ఇక్కడ కేసీఆర్ స్నేహితుడు భూక్య జాన్సన్ కు అవకాశం ఇచ్చారు. ఆ స్థానంలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది.అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.
మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది .సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, కెసిఆర్ పట్టించుకోకుండా వారికే టికెట్ ఇవ్వడం బీ ఆర్ ఎస్ కొంప పంపముంచింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.








