ఆ ఎమ్మెల్యే టీడీపీ వైపు చూస్తున్నారా.. అధికార పార్టీలో ప్రాధాన్య‌త‌ లేద‌ని...!

గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలోని వైసీపీ కొన్ని జిల్లాలో అన్ని సీట్ల‌ను ద‌క్కించుకుంది.ప్ర‌త్య‌ర్థుల‌కు చాన్స్ ఇవ్వ‌కుండా క్లీన్ స్వీప్ చేసింది.

 Is That Mla Looking Towards Tdp.. He Said That There Is No Priority In The Rulin-TeluguStop.com

అందులో వైసీపీ బలంగా ఉన్న జిల్లా నెల్లూరు ఒకటి.గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది.

కాగా ప్రస్తుతం అదే జిల్లాలో వెంకటగిరి నుంచి ఆనం రాంనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.జగన్ మొదటి మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది.

ఇక రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు.కానీ ఆనం రాం నారాయణరెడ్డిని పట్టించుకోలేదు.

పార్టీ నేతలు కూడా ఆయనను లైట్ తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.

అప్ప‌ట్లో కీల‌క శాఖ‌లు అయితే నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

రాష్ట్రంలోనే రాజకీయంగా ప్రత్యేకత కలిగిన కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి.ఈ కుటుంబం నుంచి గతంలో ఆనం రాంనారాయణరెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు.

ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.కాగా ఆనం రాంనారాయణరెడ్డి 2004, 2009లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఆయన మరణించాక రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆర్థికం వంటి కీలక శాఖలన నిర్వ‌హించారు.

ఓ దశలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన పేరు వినిపించింది.ఇక అదే సమయంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త‌ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జగన్ పై ఘాటు విమర్శలు చేసినవారిలో ఆనం రాంనారాయణరెడ్డి కూడా ఉంటారు.

కుమార్తె కైవ‌ల్యారెడ్డి లోకేష్ తో భేటీ ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆనం రాంనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి గెలుపొందారు.అయితే ఆయనకు వైసీపీలో త‌గిన ప్రాధాన్య‌త ల‌భించ‌లేద‌నే అసంతృప్తి ఉందని అంటారు.

ఆయన సీనియారిటీని గుర్తించ‌లేద‌నే వాద‌న కూడా ఉంది.ఈ నేపథ్యంలో మే నెల చివరలో టీడీపీ మహానాడు సందర్బంగా ఆనం రాంనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి.

నారా లోకేష్ తో భేటీ కావడం చర్చకు దారి తీసింది.కైవల్యా రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని.

గతంలో తన తండ్రి గెలిచిన ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి.

Telugu Anam Ram Yana, Anamvivekanamda, Anil Yadav, Cm Jagan, Kakanigoverdhan-Pol

మరోవైపు తన కుమార్తె కైవల్యారెడ్డిని ఆనం రాంనారాయణరెడ్డే టీడీపీలోకి పంపుతున్నారని గాసిప్స్ వినిపించాయి.అంతేకాకుండా గత కొంతకాలం ఆనం రాంనారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారు.దీంతో టీడీపీలోకి వెళ్లనున్నారని.

అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి.ఈ నేపథ్యంలోనే ఆనం రాంనారాయణరెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆనం ఎక్క‌డా టంగ్ స్లిప్ కాలేదు.అయితే మారో విష‌యం ఏంటంటే వైసీపీలో కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్క‌డం క‌ష్ట‌మే అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ త‌ర‌ఫున ఆత్మ‌కూరు నుంచి బ‌రిలోకి దిగుతార‌ని అంటున్నారు.మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube