తెలంగాణలో కాంగ్రెస్( Congress ) కు బలం పెరగటం కోసమే తెలంగాణ ఎన్నికల లో టిడిపి ( TDP )పోటీ చేయటం లేదన్న బారతీయ రాష్ట్ర సమితి మరియు భాజపా నేతల వ్యాఖ్యలు నిజమేనన్నట్టుగా వివిద పరిణామాలు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన భాగస్వాములుగా పొత్తు పెట్టుకున్న జనసేన టిడిపిలు వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
సమన్వయ సమావేశాలు పెట్టుకుంటూ కార్యకర్తల మధ్య ఐఖ్యత కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాయి .మరో వైపు తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో( BJP ) కలిసి జనసేన పోటీకి సిద్ధమైంది.8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించింది.ఆంధ్ర సెటిలర్ల ఓట్లతోపాటు, పవన్ సినీ గ్లామర్ తో కనీస సంఖ్యలో నాలుగైదు సీట్లైనా గెలిస్తే తెలంగాణ అసెంబ్లీలో తమ ప్రాతినిధ్యం ఉంటుందని ఆ పార్టీ ఆశపడుతుంది.
దీనికి గాను ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన పార్టీగా టిడిపికి ఎంతో కొంత గుర్తింపు వోటు బ్యాంక్ తెలంగాణలో మిగిలే ఉంది .అలాంటప్పుడు తమ భాగస్వామ్య పక్షం అయిన జనసేన కు ఓపెన్ గా టిడిపి మద్దతు ప్రకటిస్తే అది జనసేనకు ఉపయోగపడే అవకాశం ఉంది.కానీ ఈ విషయంలో మాత్రం టిడిపి గుంభనం గా ఉంది .అయితే పరోక్షంగా తమ మద్దతు కాంగ్రెస్కు ఇస్తున్నట్లుగా తెలుగుదేశం అనుకూల మీడియా లో ప్రచారం జరుగుతుంది.ఆ ప్రచారాన్ని కూడా పార్టీ ఖండించకపోవడంతో తెరవెనక కాంగ్రెస్తో స్నేహం కోసం బాబు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.
మరి ఒకవైపు ఆంధ్రాలో తన మద్దతు కోసం పరితపిస్తూ మరోవైపు తెలంగాణలో తమ పోటీకి కనీస మాత్రం సాయం చేయని తెలుగుదేశం పట్ల జనసేనా ని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూడాలి.ఒక వేల జనసేన కు మద్దత్తు ప్రకటిస్తే పొత్తు ఉంది కాబట్టి బజాపా కు కూడా మద్దత్తు ప్రకటించినట్టు అవుతుంది అనుకుంటే కనీసం జనసేన పోటీ చేస్తున్న 8 స్తానా ల లో అయినా మద్దత్తు ఇస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ అయినా ఇస్తే పొత్తు ధర్మం పాటించినట్టు ఉండేది .కానీ తమ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అన్నట్టుగా ఉన్న టిడిపి దొరణి ఈ రెండు బాగస్వామ్య పక్షాల మధ్య కొత్త ఇబ్బంధులు తెస్తుందేమో అన్న చర్చ జోరుగా జరుగుతుంది
.