Telangana TDP : తెలంగాణ పై టీడీపీది అత్యాశేనా ?

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో టిడిపి పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పేరుకు పార్టీ ఉన్నా,  పెద్దగా కార్యకలాపాలేమి చోటు చేసుకోవడం లేదు.

ఆ పార్టీలో కీలక నాయకులుగా గుర్తింపు పొందిన వారు ఎంతోమంది టిఆర్ఎస్ , కాంగ్రెస్ బిజెపిలలో చేరిపోయారు.తెలంగాణ ఏర్పడిన మొదట్లో కాస్తో, కూస్తో టిడిపి ప్రభావం చూపించినా, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఉన్నా లేనట్టుగానే ఉంది.

తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.రమణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందారు.చివరకు ఆయన కూడా పార్టీ పరిస్థితిని చక్కదిద్దలేక టిఆర్ఎస్ లో చేరిపోయారు.

ఇక ఆ తరువాత బక్కాని నరసింహులు అనే వ్యక్తిని తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా బాబు నియమించారు.ఆయన పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం , పార్టీ బలోపేతం అయ్యే అవకాశం కనిపించకపోవడంతో ముదిరాజ్ సామాజిక వర్గం లో మంచిపట్టున్న ఆర్థిక స్థితిమంతుడైన కాసాని జ్ఞానేశ్వర్ కు తెలంగాణ టిడిపి బాధ్యతలను అప్పగించారు.

Advertisement

ఇక 2023 ఎన్నికల్లో టిడిపి ని పోటీకి దింపి కీలకం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సూచనలతో జ్ఞానేశ్వర్ పూర్తిగా పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టారు.ఈ క్రమంలోని తెలంగాణలో తాము 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దింపుతామని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. 

ఎక్కువ స్థానాల్లో యువ కార్యకర్తలకు టికెట్లు ఇస్తామని ఆయన చెప్పారు.అంతేకాదు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.ఎన్టీఆర్ భవన్ లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్ష జరిపిన జ్ఞానేశ్వర్ పార్టీ అభ్యర్థులను అన్ని స్థానాలలోను పోటీకి దించబోతున్నామనే విషయాన్ని ప్రకటించారు.

అయితే తెలంగాణలో టిడిపి ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్న క్రమంలో కచ్చితంగా గెలుస్తామనుకున్న బలమైన నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప,  అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దింపడం అనేది వృధా ప్రయాస అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు