టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న శ్రీ లీల లేటెస్త్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే.సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో ధామాకా బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
విజయ్ ఖుషి సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. జెర్సీ సినిమా తర్వాత గౌతం తెలుగులో చేస్తున్న సినిమా ఇదే.అసలైతే గౌతం రాం చరణ్ తో ఒక సినిమా చేయాల్సి ఉన్నా అది ఎందుకో కుదరలేదు.ఫైనల్ గా విజయ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఇక విజయ్ తో శ్రీలీల జోడీ కట్టడం కూడా సినిమాపై క్రేజ్ తెచ్చేలా చేస్తుంది.అయితే రౌడీ హీరో సినిమా అంటే తప్పకుండా లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే.శ్రీలీల లాంటి అందగత్తె ఉన్నప్పుడు అసలు అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా సరే లిప్ లాప్ పెట్టాలని అనిపిస్తుంది.మరి విజయ్ సినిమాలో శ్రీలీల లిప్ లాక్ ఉంటుందా.
ఒకవేళ ఉంటే అమ్మడు దానికి రెడీనా అన్నది తెలియాల్సి ఉంది.రెండు సినిమాలకే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల రాబోయే రోజుల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.







